Dhanush: 'ఇడ్లీ కొట్టు' రన్ టైమ్ ఎంతంటే...
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:23 PM
ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన 'ఇడ్లీ కొట్టు' అక్టోబర్ 1న జనం ముందుకు వస్తోంది. ఈ సినిమాకు 'యు' సర్టిఫికెట్ లభించింది.
ధనుష్ (Dhanush), నిత్యామీనన్ (Nithya Menen) జంటగా నటించిన సినిమా 'ఇడ్లీ కొట్టు' (Idli Kottu). విశేషం ఏమంటే... వీరిద్దరూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా అవార్డును అందుకున్న వారే. గతంలో 'తిరు' (Thiuru) చిత్రంలోనూ వీరు కలిసి నటించారు. ఇక ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో చిత్రం 'ఇడ్లీ కొట్టు' విషయానికి వస్తే... ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు... ఈ సినిమాకు 'యు' సర్టిఫికెట్ లభించింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు 'యు/ఎ', 'ఎ' సర్టిఫికెట్ వస్తున్న నేపథ్యంలో ధనుష్ 'ఇడ్లీ కొట్టు'కు 'యు' సర్టిఫికెట్ రావడం విశేషం అనే చెప్పాలి. ఫ్యామిలీ డ్రామాగా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్టోబర్ 1న దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమా రన్ టైమ్ 147 నిమిషాలు.
ఈ యేడాది ప్రారంభంలోనే ధనుష్ డైరెక్ట్ చేసిన మూడో చిత్రం 'జాబిలమ్మ నీకు అంతకోపమా' విడుదలైంది. దీనికి ముందు ధనుష్ 'పా పాండి (Pa Paandi), రాయన్ (Raayan)' సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా 'ఇడ్లీ కొట్టు'ను గ్రామీణ వాతావరణంలో భావోద్వేగాలను మిళితం చేస్తూ తీశాడు. ఫ్యామిలీ వ్యాల్యూస్ కూ ఈ సినిమాలో ధనుష్ అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో ఎస్.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై చింతపల్లి రామారావు రిలీజ్ చేస్తున్నారు.
Also Read: ANR: గాయకుడు రామకృష్ణ గానయాత్ర...
Also Read: Rukmini Vasanth: మా రుక్మిణిని.. తక్కువ చేసి మాట్లాడొద్దు! అభిమానుల ఆగ్రహం
Also Read: Kantara Chapter 1: తెలుగోళ్ల ఆగ్రహం.. ట్రెండ్‌లో ‘బాయ్‌కాట్ కాంతార చాప్టర్ 1’