Rishab Shetty: దయచేసి ఆ పని చేయకండి.. రిషబ్ విన్నపం
ABN, Publish Date - Oct 03 , 2025 | 02:26 PM
కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)నటించి, దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా చాఫ్టర్ 1 (Kantara Chapter 1).
Rishab Shetty: కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)నటించి, దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా చాఫ్టర్ 1 (Kantara Chapter 1). హోంబాలే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 2 న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది. రిషబ్ మరోసారి కాంతారతో హిట్ అందుకున్నాడు. ఎన్నో ఏళ్ళు రిషబ్ పడిన కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. అక్కడక్కడ వివాదాలు, విషాదాలు జరిగినా కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టుకుంటుంది.
ఇక ఒక సినిమా థియేటర్ లోకి వచ్చింది అంటే ఆలస్యం. థియేటర్ లో ఉన్న బొమ్మ.. సోషల్ మీడియాలో కనిపిస్తుంది. లేదా యూట్యూబ్ లో ప్రత్యేక్షం అవుతుంది. ఈ ఫైరసీ భూతం వలన ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇక ఫైరసీకి అడ్డుకట్ట వేయడానికి పోలీస్ అధికారులు బాగానే కష్టపడుతున్నారు. తాజాగా రిషబ్ శెట్టి కూడా అభిమానులకు విన్నవించుకున్నాడు. దయచేసి ఫోన్ లలో రికార్డులు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కోరాడు.
'సినిమా ప్రియులారా, ప్రారంభం నుండి.. కాంతారా మాదిలాగే మీది కూడా. మీ ప్రేమ మరియు మద్దతు ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాయి. పైరసీకి మద్దతు ఇవ్వవద్దని మేము వినయంగా అభ్యర్థిస్తున్నాము. ఇది సినిమాను దెబ్బతీయడమే కాకుండా, దాని కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వేలాది మంది కలలను కూడా దెబ్బతీస్తుంది. మంచి ఉద్దేశ్యంతో కూడా థియేటర్ల నుంచి వీడియోలను రికార్డ్ చేయవద్దని లేదా షేర్ చేయవద్దని అభిమానులను కూడా మేము కోరుతున్నాము. కాంతారా చాఫ్టర్ 1 ప్రతి శబ్దం, ప్రతి ఫ్రేమ్, ప్రతి భావోద్వేగాన్ని అనుభూతి చెందడానికి పెద్ద స్క్రీన్ కోసం రూపొందించబడింది. ఈ ప్రయాణాన్ని కలిసి కాపాడుకుందాం. థియేటర్లలో కాంతారాను మరపురాని అనుభవంగా ఉంచుకుందాం' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.