సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rishab Shetty: రణ్‌వీర్‌.. అలా చేయడం ఇబ్బందిగా అనిపించింది

ABN, Publish Date - Dec 17 , 2025 | 07:28 AM

‘కాంతార’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ అనుకరించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Rishab Shetty

‘కాంతార’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ అనుకరించడం వివాదాస్పదమైన (Kantara controversy) సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ‘కాంతార’ చిత్రం దర్శకుడు, కథానాయకుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్పందించారు. ‘రణ్‌వీర్ (Ranveer Singh) అలా చేయడం ఇబ్బందిగా అనిపించింది.

దైవిక అంశాలతో రూపొందిన సినిమా అది. ఆ అంశాలతో మా కన్నడ ప్రజలకు చాలా లోతైన అనుబంధం ఉంది. అందుకే నేను ఎక్కడికెళ్లినా ఈ సినిమాలోని సన్నివేశాలను వేదికలపై హాస్యాస్పదంగా అనుకరించవద్దని కోరుతుంటాను’ అని పేర్కొన్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో రణ్‌వీర్‌ ‘కాంతార’లోని ‘ఓ..’ అనే శబ్దాన్ని స్టేజీపై అనుకరించి కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. ఆపై ఆయ‌న క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు సైతం చెప్పారు.

Updated Date - Dec 17 , 2025 | 07:34 AM