సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kantara: Chapter 1: బాక్సాఫీస్ వ‌ద్ద.. రిష‌బ్‌ వీర విహారం! వారంలోనే.. రూ. 500 కోట్లు

ABN, Publish Date - Oct 09 , 2025 | 10:46 AM

కాంతార చాఫ్ట‌ర్ 1 (Kantara: Chapter 1) ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Kantara: Chapter 1

ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని థియేట‌ర్ల‌కు వ‌చ్చిన కాంతార చాఫ్ట‌ర్ 1 (Kantara: Chapter 1) ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి పాజిటివ్ ద‌క్కించుకుని అంత‌కుమించి అనే స్థాయిలో వీర విహారం చేస్తుంది.

కాంతార సాధించిన విజ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని దానిని మించిన విస్తృత‌మైన క‌థ‌, సంగీతం, అదిరే విజువ‌ల్స్ తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. రిష‌బ్ షెట్టి (Rishab Shetty) ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌ను బ‌రించి అంతా తానే అయి రూపొందించిన ఈ సినిమా ప్ర‌తి ఫ్రేమ్‌లో ఆ క‌ష్టం స్ప‌ష్టంగా క‌నిపించింది.

ఇప్పుడు అందుకు త‌గ్గ‌ట్టుగానే థియేట‌ర్ల వ‌ద్ద మంచి ఫ‌లితాలు పొందుతుంది. ప్రఖ్యాత హొంబులే ఫిలింస్ (Hombale Films) సుమారు. రూ130 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ450 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. ప్ర‌ధాన పాత్ర దారులు రిష‌బ్‌, రుక్మిణి (Rukmini Vasanth)ల న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో కాంతార విజృంభ‌ణ చూస్తుంటే రూ. 1000 కోట్ల మార్క్‌ను ట‌చ్ చేసేలా ఉంద‌ని చాలామంది నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇదిలాఉంటే.. 2022లో వ‌చ్చిన మొద‌టి సినిమా కాంతార కేవ‌లం రూ.16 కోట్ల‌తో తెర‌కెక్కి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూల్లు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Oct 09 , 2025 | 11:02 AM