Lakshmi Menon: బార్ వద్ద గొడవ.. కిడ్నాప్ కేసులో హీరోయిన్ కు ఊరట
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:05 PM
కోలీవుడ్ నటి లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) కు కోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ కోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
Lakshmi Menon: కోలీవుడ్ నటి లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) కు కోర్టులో ఊరట లభించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ కోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. గత ఆదివారం రాత్రి లక్ష్మీ మీనన్, ఆమె ముగ్గురు స్నేహితులు కలిసి ఒక ఐటీ టెక్కీని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు కొచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. బాధితుడు అయినా ఐటీ ఉద్యోగినే స్వయనా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు.
ఇక కేసు నమోదు అనంతరం లక్ష్మీ మీనన్ స్నేహితులు అయిన మిథున్, అనీష్ మరియు సోనమోల్ ను ఇప్పటికే అరెస్ట్ చేశామని లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆమె మాత్రం కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తీసుకొని తనకు రక్షణ కల్పించాలని కోరింది. దీంతో కోర్టు ఆమెకు రక్షణ కల్పించమని ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది అంటే.. ఆదివారం రాత్రి కొచ్చిలోని వెలాసిటీ పబ్ కు లక్ష్మీ మీనన్,మిథున్, అనీష్ మరియు సోనమోల్ ఒక బార్ కు వెళ్లారు. అక్కడ ఏదో విషయంలో ఐటీ ఉద్యోగితో వివాదం జరిగింది. అతను, తన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మీ మీనన్ ఫ్రెండ్స్ తన కారును వెంబడించి.. తనను వేరే కారులోకి తీసుకెళ్లి తనపై దాడి చేశారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే లక్ష్మీ మాత్రం ఐటీ ఉద్యోగి చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని, తన పరువు తీయడానికే ఇదంతా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం లక్ష్మీ మీనన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 17 న జరగనుంది. ఇక లక్ష్మీ మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 సినిమాలతో మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా అమ్మడు నటిస్తుంది. మరి ఈ కేసు ద్వారా ఈ చిన్నది ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి.
Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే
Director Vijay Milton: రాజ్ తరుణ్ హీరోగా 'గాడ్స్ అండ్ సోల్జర్'