సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ravi Mohan: నిన్న రాజ్.. నేడు రవి.. పెళ్లి కాకుండానే వారితో

ABN, Publish Date - Dec 03 , 2025 | 03:09 PM

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు చేసే పనులు చాలామందికి షాక్ కు గురిచేస్తున్నాయి. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో.. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో.. విడాకులు ఇవ్వకుండా వేరొకరితో రిలేషన్, సడెన్ గా పెళ్లి.. ఎవరు ఏమనుకుంటారు.. ?

Ravi Mohan

Ravi Mohan: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు చేసే పనులు చాలామందికి షాక్ కు గురిచేస్తున్నాయి. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో.. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో.. విడాకులు ఇవ్వకుండా వేరొకరితో రిలేషన్, సడెన్ గా పెళ్లి.. ఎవరు ఏమనుకుంటారు.. ? అనేది వారికి అనవసరం. ఇక మొన్నటికి మొన్న సమంత (Samantha) - రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సడెన్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. రాజ్ తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. విడాకులు ఇవ్వకుండానే రాజ్.. సమంతతో రిలేషన్ లో ఉన్నాడు. కలిసి తిరిగారు. పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇక ఇప్పుడు రాజ్ లానే కోలీవుడ్ హీరో రవి మోహన్ (Ravi Mohan) కూడా మారాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. గత కొంతకాలంగా రవి మోహన్ తన భార్య ఆర్తికి మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తున్న విషయం తెల్సిందే. గతేడాది తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చినట్లు రవి మోహన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. అయితే విడాకులు విషయం తనకు తెలియదని, తన అనుమతి లేకుండా పోస్ట్ చేసినట్లు ఆర్తి చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికీ వీరి విడాకుల కేసు కోర్టు లో నడుస్తోంది.

విడాకుల కేసు కోర్టులోకి రాకముందే రవి మోహన్, సింగర్ కేనీషాతో రిలేషన్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని సమాచారం. తాజాగా ఈ జంట తిరుమలలో సందడి చేసింది. నేటి ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరిద్దరూ స్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు భార్యలకు విడాకులు ఇవ్వకుండా.. వేరొకరితో కలిసి ఉండడం ఏంటో.. త్వరలో వీరు కూడా పెళ్లి చేసుకొని షాక్ ఇస్తారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 03:28 PM