సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Parasakthi: రత్నమాల.. ఈ మెలోడీ సాంగ్ ఏంటబ్బా ఇంత బావుంది

ABN, Publish Date - Nov 23 , 2025 | 07:34 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan), శ్రీలీల(Sreeleela) జంటగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న చిత్రం పరాశక్తి(Parasakthi).

Parasakthi

Parasakthi: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan), శ్రీలీల(Sreeleela) జంటగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న చిత్రం పరాశక్తి(Parasakthi). అథర్వ, రవి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా రత్నమాల అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మెలోడీ సాంగ్స్ ఇవ్వడంలో జీవీ ప్రకాష్ సిద్ధహస్తుడు అని చెప్పొచ్చు. ఈ రత్నమాల కూడా అదే కోవలోకి వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎంతో స్లోగా.. స్మూత్ గా సాంగ్ వినడానికి వినసొంపుగా అనిపిస్తుంది. తెలుగులో ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాష్ కుమార్ నే ఆలపించారు.

వీడియోలో శివకార్తికేయన్, శ్రీలీల మధ్య రొమాన్స్ కనిపిస్తుంది. ఇక 90 ల కాలం నాటి సినిమా కాబట్టి శ్రీలీల కట్టు బొట్టు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిండుగా లంగా వోణి, ఒంటి నిండా నగలతో అదిరిపోయింది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. రత్నమాల ఫుల్ సాంగ్ ను నవంబర్ 25 న రిలీజ్ చేయనున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 07:34 PM