Rajinikanth: పుసక్తంగా రజనీకాంత్ 'ఆత్మకథ'
ABN, Publish Date - Jul 26 , 2025 | 06:39 PM
ఆయన జీవితం ఒక స్ఫూర్తి పాఠం. చిరు ఉద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన.. అనుకోకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేశాడు. అలాంటి రేర్ పర్సన్ గురించి ఆటోబయోగ్రఫీ రాబోతుందన్న న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth). ఇది కేవలం పేరు మాత్రమే కాదు... ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన జీవితం ఎన్నో కష్టాలను జయించి సామాన్యత నుంచి అసామాన్యతకు చేరుకున్న ఒక అద్భుత కథ. శివాజీ రావు గైక్వాడ్ (Shivajirao Gaikwad) గా.. బస్ కండక్టర్‌గా తన జీవన యాత్రను ప్రారంభించిన ఆయన, తన అసమానమైన నటనా నైపుణ్యంతో, అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మనసులను గెలుచుకున్నాడు. మరాఠీ కుటుంబంలో జన్మించి, కర్ణాటకలో పెరిగి, తమిళ ప్రేక్షకుల మనసుల్ని చూరగొని సూపర్ స్టార్‌గా మార్చారు. అక్కడి నుంచి పాన్ఇండియా, గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకమే కానీ అందులో చాలామందికి తెలియని విషయాలు దాగి ఉన్నాయి. ఆ విషయాలను అందరితో పంచుకునేందుకు ఆయన ఆత్మకథ రాస్తున్నారనే విషయం ఇప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రజనీకాంత్ ఆత్మకథ రాస్తున్నారనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagara) తాజాగా బయటపెట్టారు. 'కూలీ' (Coolie) మూవీ సెట్ లో తన ఆత్మకథను రాస్తున్నట్లు రజనీకాంత్ తెలిపారు. ఇందులో ఆయన జీవితంలోని అనేక తెరవెనుక కథలు, సవాళ్లు, ఆధ్యాత్మిక పరివర్తనలు వెలుగులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు కండక్టర్ గా మద్యపానం, మాంసాహారం లేకుండా రోజు గడపని రజనీకాంత్... ఆధ్యాత్మిక జీవనంలోకి మారిన వైనాన్ని ఇది తెలుపుతుందని టాక్ వినిపిస్తోంది.
ఒక సినిమా కథలా ఎవరు ఊహించలేని ట్విస్టులతో కూడిన ఆయన జీవితంపై పుస్తకంగా వచ్చిందంటే ఒక సెన్సేషన్ అవుతుంది. రజనీ ఆత్మకథ ఒక డాక్యుమెంటరీగా కూడా రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన సినిమాల ఐకానిక్ క్షణాలు, సహనటులు, దర్శకుల ఇంటర్వ్యూలు, ఆయన జీవితంలోని లోతైన అంశాలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తాయని కూడా చెబుతున్నారు. ఈ పుస్తకం, డాక్యుమెంటరీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి మరి.
Read Also: Krish: పవన్‌తో విభేదాలు లేవు.. త్వరలో అన్ని బయటకొస్తాయి..
Read Also: Mirai Song: సాంగ్ లోనే కాదు.. కుర్రాడిలో కూడా మంచి వైబ్ ఉందిగా