Rajinikanth: రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ.. అదే ఆఖరి సినిమానా
ABN, Publish Date - Oct 28 , 2025 | 07:35 PM
సాధారణంగా ఏ రంగంలో అయినా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ.. సినీ రంగంలో ఉండదు. ప్రతి ఒక్క నటుడు తన చివరి శ్వాస వరకు నటించాలని కోరుకుంటాడు.
Rajinikanth: సాధారణంగా ఏ రంగంలో అయినా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ.. సినీ రంగంలో ఉండదు. ప్రతి ఒక్క నటుడు తన చివరి శ్వాస వరకు నటించాలని కోరుకుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) అలానే మనం సినిమా చేస్తూనే మరణించారు. ఇక చాలామంది నటులు తమ చివరి కోరిక కూడా అదే అని చెప్పుకొచ్చారు. ఇక మరికొంతమంది మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి శేష జీవితాన్ని కుటుంబంతో.. సంతోషంగా గడపాలని ప్లాన్ చేసుకుంటారు. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా ఉన్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ప్రస్తుతం రజినీ వయస్సు 74. ఇప్పటివరకు కూడా ఆయన సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నారు. మధ్యలో అనారోగ్యానికి గురైనా కూడా తలైవా సినిమాలు చేయడం మానలేదు. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే భయపడుతున్న కుర్ర హీరోల మధ్య ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు రజినీ. ఇక మధ్యలో హిమాలయాలకు వెళ్లడం, ఆధ్యాత్మిక సేవ చేయడం చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం జైలర్ 2 తో బిజీగా ఉన్న రజినీ.. తరువాత కమల హాసన్ తో కలిసి ఒక మల్టీస్టారర్ చేయనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా తరువాత రజిని సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని కోలీవుడ్ లో రూమర్స్ మొదలయ్యాయి. ఇదే ఆయన ఆఖరి సినిమా అని, ఆ తరువాత రజినీ సినిమాల్లో కనిపించరని వార్తలు. వస్తున్నాయి. దీంతో రజినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్న రజినీ ఈ సినిమాను పూర్తి చేసిన తర్వా సుందర్ సి తో తన తదుపరి సినిమాను ప్రారంభించి, వచ్చే ఏడాది చివరి నాటికి దాన్ని ముగించి రజినీ - కమల్ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నారు. ఇదే ఆయన చివరి సినిమా కానుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Rashmika Mandanna: పెళ్లి కూడా కాలేదు.. అప్పుడే పిల్లలు కావాలంటుందే
Emraan Hashmi: కొందరు హీరోలు సెట్ కు కూడా రారు.. ఓజీనే అన్నాడా