Thalaiva 173: రజనీ, కమల్ హాసన్ మూవీ.. ఆ ఇద్దరు దర్శకులపై ఫోకస్
ABN, Publish Date - Nov 22 , 2025 | 09:58 PM
తలైవ రజనీకాంత్ (Rajinikanth) నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించారు.
తలైవ రజనీకాంత్ (Rajinikanth) నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా సుందర్ సి పేరును అధికారికంగా వెల్లడించారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన తలైవర్ 173 నుంచి వైదొలిగారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రజినీకాంత్ స్టార్ డైరెక్టర్స్, వెనకపడటం లేదని కోలీవుడ్ టాక్ నడుస్తోంది. అలాగే భారీ బడ్జెట్‌తోనూ ప్లాన్ చేయడం లేదట. సింపుల్ కథతో ఫోకస్‌గా సాగే సినిమా చేయాలని ప్లాన్ చేసే పనిలో ఉన్నారని తెలిసింది.
దీనితో ప్రస్తుతం రజినీ చిన్న దర్శకులు, అందులోనూ కొత్త దర్శకులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘మహారాజా’ దర్శకుడు నితిలన్,(nithilan) ‘పార్కింగ్’ దర్శకుడు రామ్‌కుమార్ (Ram kumar) ఈ ఇద్దరిలో ఏదో ఒకరు ఈ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాత కమల్ హాసన్ ఈ నెలలోనే అన్ని విషయాలను ఫైనలైజ్ చేసి, రజినీకాంత్ పుట్టినరోజున సినిమాతోపాటు దర్శకుడి పేరును ప్రకటించు అవకాశం ఉందని తెలిసింది.