సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

KS Gopali: ర‌జనీకాంత్, అమితాబ్, చిరంజీవి.. న‌ట గురువు క‌న్నుమూత‌

ABN, Publish Date - Nov 18 , 2025 | 08:20 AM

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (Chennai Film Institute) మాజీ డైరెక్టర్, ప్రముఖ నటన గురువు కేఎస్ నారాయణస్వామి (92) (KS Narayanaswamy) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

KS Gopali

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (Chennai Film Institute) మాజీ డైరెక్టర్, ప్రముఖ నటన గురువు కేఎస్ నారాయణస్వామి (92) (KS Narayanaswamy) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), చిరంజీవి (Chiranjeevi), రాధారవి, నాజర్ వంటి భారత సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నటులకు నటన పాఠాలు చెబుతూ ఆయన ఎన్నో తరాలను తీర్చిదిద్దారు.

సినీ వర్గాల్లో అందరికీ కేఎస్ గోపాలి (KS Gopali) పేరుతో సుపరిచితులైన ఆయన, తాను నేర్పిన నటుల్లో చాలా మంది ఇండియన్ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు నారాయణస్వామి మద్రాస్ దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

రజనీకాంత్ కెరీర్‌లో నారాయణస్వామి పాత్ర ప్రత్యేకమైంది. తమిళ దర్శక దిగ్గజం కె. బాలచందర్ కు రజనీకాంత్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. ఆ పరిచయం ద్వారానే రజనీ ‘అపూర్వ రాగంగళ్’ (Apurva Raagangal) సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం రజనీ సినీ జీవితం మొత్తాన్ని మార్చేసిన మైలురాయి అయింది.

సినీ ప్రపంచానికి గాఢమైన సేవలు అందించిన నారాయణస్వామి మృతి పట్ల దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 08:20 AM