Jugaari Cross: 'సు ఫ్రమ్ సో' తర్వాత మరో సినిమా...
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:52 PM
గురుదత్త గనిక స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'కరావళి' సినిమా విడుదల కాక ముందే ఆయన మరో సినిమాను ప్రారంభిస్తున్నారు. 'కరావళి'లో కీలక పాత్ర పోషించిన రాజ్ బి శెట్టి ఇందులోనూ నటిస్తున్నాడు.
ఒకప్పుడు నవలా చిత్రాలు బాగా వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయింది. యేడాది మొత్తం మీద ఒకటి రెండు సినిమాలే వస్తున్నాయి. తాజాగా ప్రముఖ కన్నడ రచయిత పూర్ణ చంద్ర తేజస్వి రాసిన ప్రసిద్థ నవల 'జుగారి క్రాస్' (Jugaari Cross) సినిమాగా రాబోతోంది. 'కరావళి' (Karavali) సినిమాను తెరకెక్కిస్తున్న గురుదత్త గనిగ (Gurudatta Ganiga) ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేశారు. ఇటీవల విడుదలైన 'సు ఫ్రమ్ సో' (Su from So) మూవీలో ప్రధాన పాత్ర పోషించిన దర్శకుడు రాజ్ బి శెట్టి (Raj B. Shetty) 'కరావళి'లోనూ కీలక పాత్ర చేస్తున్నాడు. అలానే తాజా చిత్రం 'జుగారి క్రాస్'లోనూ అతను నటిస్తున్నాడు. 'కరావళి' సినిమా విడుదలకు ముందే మరోసారి 'జుగారి క్రాస్' కోసం గురుదత్త గనికి, రాజ్ బి శెట్టి మరోసారి కలిశారు.
తాజాగా 'జుగారి క్రాస్' కు సంబంధించిన టైటిల్ ప్రోమో విడుదలచేశారు మేకర్స్. దీనిలోని పుర్రెలు, పారే రక్తం, మారణాయుధాలు చూస్తుంటే... సినిమా మరో లెవెల్ లో ఉంటుందనిపిస్తోంది. గురుదత్త గనికి, రాజ్ బి శెట్టి చేస్తున్న 'కరావళి' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ రెండు సినిమాలను దర్శకుడు గురుదత్త గనిగ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలకు అభిమన్యు సదానందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. సచిన్ బస్రూర్ సంగీతం సమకూర్చుతున్నాడు. చాలా చాలం తర్వాత తెరకెక్కుతున్న నవలా చిత్రం'జుగారి క్రాస్' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: Samantha: నేను సెక్సీ కాదు.. బోల్డ్ రోల్స్ నాకెవ్వరూ ఇవ్వలేదు
Also Read: Prabhas: 'ది రాజా సాబ్'.. మళ్ళీ వాయిదా?