సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

PVR INOX Dinner in Theater: థియేట‌ర్‌లో.. భోజ‌నం చేస్తూ సినిమా

ABN, Publish Date - Oct 09 , 2025 | 12:29 PM

ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌య‌త్నానికి నాంది ప‌లికింది.

PVR INOX Dinner Theater

భారతదేశంలో ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌య‌త్నానికి నాంది ప‌లికింది. ప్రేక్ష‌కుల‌కు అంత‌కుమించి అనేలా ఎక్స్‌పీరియ‌న్స్ ను అందించ‌డంతో పాటుకు ఆ ఫీల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్త సాంప్ర‌దాయానికి తెర తీసింది. ఇక‌పై ప్రేక్షకులు థియేట‌ర్‌లో సినిమా చూడ‌డం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డైనింగ్ స్పేస్‌లో భోజనాన్ని కూడా ఆస్వాదించే అవకాశం కల్పిస్తూ తన మొదటి డైన్-ఇన్ సినిమా (dine in cinema) మ‌ల్టీఫ్లెక్స్‌ను బెంగళూరు (PVR INOX Bengaluru)లో ప్రారంభించింది.

ఇక్కడ ప్రేక్షకులు సినిమా చూస్తూనే ప్రత్యేకంగా రూపొందించిన డైనింగ్ స్పేస్లో భోజనం చేసుకునే వీలుంది. గ్రూప్ బుకింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అంటే కార్పోరేట్‌, కుటుంబం లేదా స్నేహితులతో కలిసి గెట్ టూ గెద‌ర్ లాగా మీటింగ్స్ నిర్వ‌హించుకుంటూ ఈ ప్రత్యేక డైన్-ఇన్ అనుభవం పొందవచ్చు. అయితే.. ప్రేక్ష‌కులు నిర్వ‌హించాల‌ని అనునుకున్న ఈవెంట్‌, కంటెంట్ థీమ్‌ ఆధారంగా పీవీఆర్ రెండు ర‌కాల ధ‌ర‌లు నిర్ణ‌యించింది. ప్రస్తుతం రెండు సీటర్ల టేబుల్‌కు రూ.490, నాలుగు సీటర్లకు రూ.990గా ధ‌ర‌లు నిర్ణ‌యించారు.

అయితే.. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ప్రారంభించిన ఈ త‌ర‌హా మ‌ల్టీఫ్లెక్సుల‌ను మ‌రింత‌గా విస్త‌రిస్తూ.. 2027 నాటికి కొత్త‌గా 5 మ‌ల్టీఫ్లెక్సుల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. అయితే.. పీవీఆర్ ఐనాక్స్ FY24 వార్షిక నివేదిక ప్రకారం కేవ‌లం ఫుడ్ ద్వారా వ‌చ్చే ఆదాయం 21% వృద్ధి చెంద‌గా మొత్తం రూ.1,958.40 కోట్లు గ‌డించ‌డం గ‌మ‌నార్హం. కాగా టికెట్ల ద్వారా వ‌చ్చే ఇన్‌కం క‌న్నా ఫుడ్ వ్యాపారం ఇప్పుడు ఈ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలాఉంటే.. మ‌న హైద‌రాబాద్‌లోని గ‌చ్చీబౌలి మ‌హేశ్‌బాబు AMB Cinemas మ‌ల్టీఫ్లెక్సులో డైనింగ్‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు లేకున్నా ఇప్ప‌టికే బిర్యానీని అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న‌వారు కొనుగోలు చేసి, ఆర్డ‌ర్ చేసి తిన‌వ‌చ్చు. కానీ ఆకాశాన్నంటే రేట్లు, అందుకు భిన్నంగా క్వాంటిటీ ఉండ‌డంతో సామాన్యుడు అటు వైపు చూసే ప‌రిస్థితి ఏ కోశాన లేకుండా పోయింది.కేవ‌లం డ‌బ్బున ఉన్న వారు మాత్ర‌మే ప్ర‌స్తుతం ఆ ఫెసిలిటీని ఆస్వాదిస్తున్నారు.

అయితే కొంద‌రు క్ర‌మంగా భోజ‌నాన్ని కూడా థియేట‌ర్ల‌కు ప‌ట్టుకొచ్చారు.. మ‌రి మందు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. దానిని కూడా తీసుకురండి అది మాత్రం ఏ త‌ప్పు చేసిందంటూ సెటైరిక‌ల్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఏమో భ‌విష్య‌త్తులో ఆ రోజు కూడా వ‌స్తుందేమో వెయుట్ చేద్దాం అంటూ ప‌లువురు ఆశావాదులు ట్వీట్లు వేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 01:23 PM