Suriya: 20 ఏళ్ల మమితాతో 40 ఏళ్ళ సూర్య ప్రేమాయణం..
ABN, Publish Date - Dec 27 , 2025 | 03:43 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తెలుగులో నటిస్తున్న చిత్రం సూర్య 46 (Suriya 46). లక్కీ భాస్కర్ లాంటి మంచి హిట్ ని అందుకున్న వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తెలుగులో నటిస్తున్న చిత్రం సూర్య 46 (Suriya 46). లక్కీ భాస్కర్ లాంటి మంచి హిట్ ని అందుకున్న వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు నటిస్తుండగా.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని ఇప్పటివరకు రివీల్ చేయలేదు.
తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా ప్లాట్ ను రివీల్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన సూర్య 46 సినిమా గురించి మాట్లాడుతూ.. ఇదొక 45 ఏళ్ళ వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ అని చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి కథలు తెలుగులో చాలా తక్కువ. ఇప్పటికే హిందీలో,మలయాళంలో ఇలాంటి కథలు రావడం హిట్ అవ్వడం కూడా జరిగాయి.
అంతెందుకు మొన్నటికి మొన్న హృదయపర్వంలో కూడా ఇదే ప్లాట్. మోహన్ లాల్.. తనకన్నా చిన్న వయస్సు ఉన్న మాళవిక మోహనన్ తో ప్రేమలో పడతాడు. హిందీలో దేదే ప్యార్ దే 2 లో కూడా ఇదే కాన్సెప్ట్. ఇక ఇప్పుడు తెలుగులో అలాంటి కథతో సూర్య రాబోతున్నాడు అంటే నిజంగా రిస్క్ అనే చెప్పాలి. తన వయస్సుకు తగ్గ సినిమాలు చేస్తున్నాడు అని ఆనందపడేలోపు .. ఇలా తనకన్నా 20 ఏళ్ళ అమ్మాయితో లవ్ స్టోరీ చేస్తున్నాడు అంటే ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కొద్దిగా బాధగా ఉందని సూర్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో సూర్య విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.