Prashanth Neel: ప్రశాంత్ నీల్ రచ్చ రచ్చ
ABN, Publish Date - Jun 04 , 2025 | 06:18 PM
వెండితెరపై విధ్వంసం సృష్టించే డైరెక్టర్ అతను. ఆయనలోని మాస్ యాంగిల్ చూసి ఆడియన్స్ తో పాటు స్టారాధిస్టారులే ఆశ్చర్యపోతారు. అలాంటి డైరెక్టర్ చిన్నపిల్లాడిలా మారి సందడి చేస్తే ఎలా ఉంటుంది?.. ఆర్సీబీ విజయం ఆ సీన్ ఎలా ఉంటుందో చూపించింది.
ప్రశాంత్ నీల్.. (Prashanth Neel) ప్రజెంట్ పాన్ ఇండియా మాట్లాడుకునే పేరు ఇది. కేజీఎఫ్ (KGF), సలార్ (Salaar) సినిమాలతో ఓ లెవెల్‌కి దూసుకెళ్లిపోయాడు ప్రశాంత్. భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రశాంత్ ప్రస్తుతం ఏ అప్డేట్ ఇచ్చినా అది ప్రతీదీ వార్తే. అలాంటిది ఆయనే కావాలని రచ్చ చేస్తే ఎలా ఉంటుందో ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్ సీన్స్ కళ్ళకు కట్టినట్లు చూపించాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్( NTR)తో డ్రాగన్ (Dragon) మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో స్పెషల్ సెట్లో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. జూన్ 4న ఆయన బర్త్‌డే కాగా, డ్రాగన్ టీమ్‌తో పాటు సన్నిహితుల కోసం గ్రాండ్ గా నైట్ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ స్ట్రీమ్ చేసి సందడి చేశారు. అటు బర్త్‌డే సెలబ్రేషన్స్, ఇటు ఆర్సీబీ విజయంతో ప్రశాంత్ నీల్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయాడు. స్వతహాగా ఆర్సీబీ ఫ్యాన్ అయిన నీల్, టీమ్ ట్రోఫీ గెలవగానే పరుగులు పెట్టి, ఫ్రెండ్స్‌ను హగ్ చేసుకుంటూ ఫుల్ హంగామా చేశాడు.
ఈ ఎంజాయ్మెంట్ వీడియోను ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి నీల్ (Likitha Reddy Neel) ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రశాంత్ సంతోషంగా పరిగెత్తడం, అక్కడ చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాలో పుల్ గా వైరల్ అయింది. "ఒక క్రేజీ క్రికెట్ ఫ్యాన్‌కి ఇంతకంటే కూల్ బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుంది?" అంటూ లిఖిత కామెంట్ పెట్టింది. దేశమంతా విరాట్ కోహ్లీ టీమ్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తుంటే, బెంగళూరు కుర్రాడైన ప్రశాంత్ నీల్ ఈ విన్ను ఎంతగా ఎంజాయ్ చేశాడో ఊహించుకోవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అంతా నీల్లో ఇలాంటి క్రేజీ మాస్ యాంగిల్ కూడా ఉందా?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.