Dies Irae: ఫస్ట్ టైం.. తెలుగునాట అడుగు పెడుతున్న.. మోహన్‌లాల్ కుమారుడు!
ABN, Publish Date - Nov 05 , 2025 | 04:40 PM
మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన సినిమా Diés Iraé. భ్రమయుగం దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో స్రవంతి రవికిశోర్ విడుదల చేస్తున్నారు.
'భూతకాలం' (Bhootakaalam) తో పాటు ఇటీవల అవార్డ్ విన్నింగ్ మూవీ 'భ్రమయుగం' (Bhrama Yugam) ను తెరకెక్కించిన రాహుల్ సదాశివన్ (Rahul Sadasivan) తాజా చిత్రం 'డీయస్ ఈరే' (Diés Iraé). కేరళలో ఇటీవల జరిగిన అవార్డుల ప్రకటనలో 'భ్రమయుగం' మూవీకి నాలుగు అవార్డులు దక్కాయి. ఆ సినిమాను రూపొందించిన రాహుల్ సదాశివన్ లేటెస్ట్ మూవీ 'డీయస్ ఈరే' మలయాళంలో అక్టోబర్ 31న విడుదలైంది. దీన్ని చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. నవంబర్ 8న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్థ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. అయితే 7వ తేదీ నాడే పెయిడ్ ప్రీమియర్స్ తో తెలుగు వర్షన్ విడుదల చేయబోతున్నట్టు స్రవంతి రవికిశోర్ (Sravanthi Ravikishore) తెలిపారు. ఈ సందర్భంగా 'డీయస్ ఈరే' మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
'డీయస్ ఈరే' ట్రైలర్ చూస్తే... ఓ విలాసవంతమైన భవంతి కనిపిస్తుంది. అందులో ఓ వ్యక్తి మహిళ హెయిర్ క్లిప్ పట్టుకుని కూర్చుంటాడు. ఆ తర్వాత వింత గొంతు ఒకటి వినబడుతుంది. 'ఆకాశం... భూమి... బూడిద అవ్వగా, లోకం కన్నీళ్ల భయంతో నిండుతుంది' అని ట్రైలర్ ముగిసింది. కథ ఏమిటి? అనేది రివీల్ చేయకుండా హారర్, థ్రిల్స్ ఎలిమెంట్స్ పుష్కంలంగా ఉన్నాయని దీనిని చూస్తే అర్థమౌతోంది. మలయాళంలో 'డీయస్ ఈరే' కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. వసూళ్లతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
కమల్ హాసన్ (Kamal Haassan) 'పుష్పక విమానం', 'నాయకుడు' నుంచి ధనుష్ (Dhanush) 'రఘువరన్ బీటెక్' వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల - ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆ కోవలో 'డియస్ ఈరే' కూడా చేరుతుందని రవికిశోర్ భావిస్తున్నారు. ఈ సినిమాలో సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన 'డియస్ ఈరే' చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు.
Also Read: NTR: అయ్యా.. అయ్యా.. ఊరమాస్ లుక్ అయ్యా..
Also Read: Bandla Ganesh: స్టేజిపై అనడం ఎందుకు.. మళ్లీ క్షమించమని కోరడమెందుకు