Karnataka: బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం.. రాయబారిగా ప్రకాష్ రాజ్
ABN, Publish Date - Dec 24 , 2025 | 07:52 AM
నటుడు ప్రకాష్ రాజ్‌ను 17వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ రాయబారిగా ఎంపిక చేసినట్లు సీఎం సిద్దరామయ్య ప్రకటించారు.
నటుడు ప్రకాష్ రాజ్‌ను 17వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ రాయబారిగా ఎంపిక చేసినట్లు సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. విధానసౌధలో చలనచిత్రోత్సవాల సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ దాకా చలనచిత్రోత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. చిత్రోత్సవ కమిటీ నిర్ణయించినట్లుగా ప్రకాష్ రాజ్‌ను రాయబారిగా నిర్ణయించామని తెలిపారు. చిత్రోత్సవంలో 60 దేశాలకు సంబంధించిన 400 సినిమాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.