Pradeep Ranganathan: వంద కోట్ల క్లబ్ హీరో.. లుంగీతో ఇలా.. గుర్తుపట్టారా
ABN, Publish Date - Nov 18 , 2025 | 06:44 PM
ఒక చిన్న సినిమా హిట్ అయితే.. బ్రాండెడ్ బట్టలు వేసుకొని, చిన్నతనం నుంచి లగ్జరీ లైఫ్ బతికినట్లు కొంతమంది హీరోలు బిల్డప్ లు ఇస్తూ ఉంటారు. అంతెందుకు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాకా.. కొద్దిగా పేరు తెచ్చుకున్నవారే స్టార్ హీరోలా ఫోజులు కొడుతూ ఉంటారు
Pradeep Ranganathan: ఒక చిన్న సినిమా హిట్ అయితే.. బ్రాండెడ్ బట్టలు వేసుకొని, చిన్నతనం నుంచి లగ్జరీ లైఫ్ బతికినట్లు కొంతమంది హీరోలు బిల్డప్ లు ఇస్తూ ఉంటారు. అంతెందుకు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాకా.. కొద్దిగా పేరు తెచ్చుకున్నవారే స్టార్ హీరోలా ఫోజులు కొడుతూ ఉంటారు. కానీ, మూడు సినిమాలు.. ఒక సినిమాకు దర్శకత్వం వహించి, రెండు సినిమాలలో హీరోగా నటించి.. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో ప్లేస్ సంపాదించుకున్న ఒక హీరో మాత్రం చాలా సింపుల్ గా లుంగీతో కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే ఆ హీరో ఎవరు అనేది అందరికీ అర్దమైపోయే ఉంటుంది. కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).
లవ్ టుడే సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమా కన్నా ముందు రవి మోహన్ తో కోమాలి సినిమాకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక డైరెక్టర్ గా కంటే హీరోగానే కొనసాగుతానని ప్రదీప్ వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాదిలోనే డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ రిలీజ్ కు సిద్దమవ్వుతోంది.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రదీప్ దానినే ఫాలో అవుతున్నాడు. బయట ఎక్కువ స్టైలిష్ గా కనిపించడు. ఇంత సంపాదించినా ఇప్పటికీ బ్రాండ్స్ ఫస్ట్ కాపీనే కొంటానని అతనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రదీప్ మనసు కూడా ఎంతో గొప్పది. తాజాగా తన ఫ్రెండ్ కి కారును గిఫ్ట్ ఇచ్చాడు. లవ్ టుడే నుంచి డ్యూడ్ వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ రమేష్ నారాయణన్ కు కొత్త కారు గిఫ్ట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రమేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'ఇది నా మొదటి కారు. నా స్నేహితుడు దీన్ని నా కోసం కొన్నాడు. నాపై మీరు ఉంచిన నమ్మకానికి మరియు ప్రేమకు ధన్యవాదాలు. ఈ క్షణం ఎల్లప్పుడూ మా సంబంధాన్ని మరియు దాని ప్రయాణాన్ని నాకు గుర్తు చేస్తుంది' అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోలో ప్రదీప్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రదీప్ ఒక లుంగీ, టీ షర్ట్ తో చాలా సింపుల్ గా కనిపించాడు. స్టార్స్.. ఇంటిదగ్గర షార్ట్స్, ట్రాక్స్ లో అయినా కనిపిస్తారు. కనై, ప్రదీప్ మాత్రం లుంగీ కట్టుకొని, ఏ మాత్రం సిగ్గుపడకుండా వీడియోలో కనిపించడం అద్భుతమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఫ్యాన్స్.. వంద కోట్ల క్లబ్ హీరోవి అన్నా.. అలా బిహేవ్ చెయ్.. ఆ లుంగీ ఏంటి అంటూ కొందరు.. ఎంత సింపుల్ గా ఉన్నాడో అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.