Pradeep Ranganathan: డ్యూడ్ టైటిల్ ఖరారు... దీపావళికి విడుదల

ABN , Publish Date - May 10 , 2025 | 06:28 PM

ప్రదీప్ రంగనాథన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రానికి పేరు ఖారరు చేశారు. 'డ్యూడ్' పేరుతో ఈ చిత్రం దీపావళికి జనం ముందుకు రాబోతోంది.

Pradeep Ranganathan: డ్యూడ్ టైటిల్ ఖరారు... దీపావళికి విడుదల

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే' (Love today) తో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తమిళ, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్ హిట్ 'డ్రాగన్' (Dragon) తో మ్యాసీవ్ పాపులరిటీ సాధించాడు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు. పాన్ - ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళ, తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్ (Keerthiswaran) ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. 'ప్రేమలు' (Premalu) చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sharath Kumar) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా పేరును శనివారం రివీల్ చేశారు. దీనికి 'డ్యూడ్' (Dude) అనే పేరును పెట్టారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.


PR-4-P2 (1).jpg'డ్యూడ్' టైటిల్ ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అలానే ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజా పోస్టర్ యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్ లో, ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకుని కనిపించాడు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూచించినట్లుగా, 'డ్యూడ్' మోడరన్ ట్విస్ట్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందబోతున్నట్టు తెలుస్తోంది.

'డ్యూడ్' చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో దీపావళికి సరైన ఎంటర్టైనర్ ను అందించడానికి టీం వేగంగా పని చేస్తోంది. 'డ్యూడ్' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సైతం విడుదల చేయబోతున్నారు.

Also Read: Kichcha Sudeep: మేమంతా మీవెంటే అంటున్న సుదీప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 10 , 2025 | 06:31 PM