Prabhu Deva Vadivelu: ప్రభుదేవా, వడివేలు కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ
ABN, Publish Date - Aug 27 , 2025 | 09:20 AM
చాలా విరామం తర్వాత ప్రభు దేవా, హాస్య నటుడు వడివేలు కలిసి యాక్షన్–అడ్వెంచర్ మూవీలో నటించనున్నారు.
చాలా రోజుల విరామం తర్వాత ప్రముఖ నటుడు ప్రభు దేవా (Prabhu Deva), హాస్య నటుడు వడివేలు (Vadivelu) కలిసి యాక్షన్–అడ్వెంచర్ మూవీలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా చెన్నైలో ఘనంగా జరిగింది. గతంలో ప్రేమదేశం మరో నాలుగైదు సినిమాల్లో వీరి కాంబినేషన్‌కు మంచి పేరు రాగా తిరిగి సుమారు రెండు దశాబ్దాల తర్వాత వీరి కలయికలో మూవీ రానుండడంతో ఈచిత్రం పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి శ్యామ్ రొడ్రిగ్స్ (Shyam Rodrigues) దర్శకత్వం వహించనుండగా, ‘అనిమల్’, ‘ఏస్’ వంటి చిత్రాల్లో ఆకట్టుకున్న బబ్లూ పృధ్వీరాజ్ (BabluPrudhviraj) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా (Raja yuvan) సంగీతం అందిస్తున్నాడు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్‌లోనే చిత్రీకరణ పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.
ఇది కేఆర్‌జీ నిర్మాణ సంస్థ (KRG Productions) నిర్మిస్తున్న నాలుగో ప్రాజెక్ట్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంపై నిర్మాత కణ్ణన్ రవి (Kannan Ravi) విశ్వాసం వ్యక్తం చేశారు. “ఈ సినిమా కథనంలో యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు ప్రకటిస్తాం” అని దర్శక,నిర్మాతలు వెల్లడించారు.