Puneeth Rajkumar: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డ్యూడ్
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:56 PM
త్రిభాషా చిత్రం 'డ్యూడ్' షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన దర్శకుడు, హీరో తేజ్ త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు.
కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమా 'డ్యూడ్' (Dude). ఫుట్ బాల్ (Football) నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) కు అంకితం చేస్తున్నారు. ఈ సినిమాను తేజ్ (Tej) డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తేజ తెలిపాడు. అతి త్వరలోనే 'డ్యూడ్' మూవీ టీజర్ విడుదల కానుంది.
ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ, 'హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్' ఔట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం' అని అన్నారు. రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్ (Raghavendra Rajkumar) ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దీపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశస్విని, మెర్సి, మోనిషా... ఫుట్ బాల్ అంటే పడి చచ్చిపోయే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జింకే మారి' ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతున్నారు. 'అలా మొదలైంది' ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజ్.
Also Read: The Rajasaab: రెబల్ మేనియా వెయిటింగ్ ఈజ్ ఓవర్
Also Read: Telugu Cinema: సస్పెన్స్ థ్రిల్లర్ గా వైల్డ్ బ్రీత్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి