Pooja Hegde: పూజా.. లక్ మారదా! ధనుష్‌కు జోడీగా మరోసారి సాయి పల్లవి?
ABN, Publish Date - Nov 20 , 2025 | 12:25 PM
మూడు నాలుగేండ్లుగా తెలుగు తెరపై అంతగా కనిపించని పూజా హెగ్డేకు కూలీ సినిమాలోని మోనిక పాట తర్వాత సౌత్ నుంచి బాగానే అవకాశాలు తలుపు తట్టుతున్నాయి.
మూడు నాలుగేండ్లుగా తెలుగు తెరపై అంతగా కనిపించని పూజా హెగ్డే (Pooja Hegde) కు కూలీ సినిమాలోని మోనిక పాట మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఆ పాట తర్వాత సౌత్ నుంచి బాగానే అవకాశాలు తలుపు తట్టుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రస్తుతం తలపతి విజయ్‌తో ‘జననాయకన్’, లారెన్స్‌తో ‘కాంచన 4’, తెలుగులో దుల్కర్‌తో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక ఇటీవల వరుస విజయాలతో మంచొ ఊపు మీద ఉన్న ధనుష్ తదుపరి సినిమాలో సైతం ఛాన్స్ దక్కించుకున్నట్లు బాగా వినిపించింది.
అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజ్ కుమార్ పెరియసామి (Rajkumar Periyasamy) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా రూపొందుతున్న ఈ భారీ ప్రొజెక్ట్‌లో పూజా ఛాన్స్ చివరి దశలో తప్పిపోయి, ఆమె స్థానంలో సాయి పల్లవి (Sai Pallavi) ఫైనల్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘తండేల్’ తర్వాత తెలుగులో సాయి పల్లవి పేరే ఎక్కడా వినిపించకపోయినా, ధనుష్ 55వ సినిమాకు మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘అమరన్’ సమయంలో దర్శకుడు రాజ్ కుమార్‌తో వచ్చిన మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కారణంగానే ఆమె ఒప్పుకుందని కోలీవుడ్ టాక్.
సాయి పల్లవి ఇప్పటికే ధనుష్‌తో ‘మారి 2’లో నటించి ‘రౌడీ బేబీ’ పాటతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఆ మేజిక్ మళ్లీ రిపీట్ చేయబోతుందనే టాక్ వచ్చేసింది. కాగా.. సాయి పల్లవి ప్రస్తుతం నితీష్ తివారి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తోంది. ఇది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో, ఆమె ఎక్కువ భాగం డేట్స్ ఈ చిత్రానికే కేటాయించిందని సమాచారం.
కొంతకాలంగా పూజా హెగ్దేకి తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలలో లక్ కలిసి రావడం లేదు. దాదాపు కన్ఫర్మ్ అయిన పాత్రలు చివర్లో మిస్సవుతున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఇదే ప్యాటర్న్ కొనసాగుతుండడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడీ ధనుష్ సినిమా అవకాశం కూడా కోల్పోవడంతో "పూజా బ్యాడ్ లక్ కోలీవుడ్‌లో కూడా స్టార్ట్ అయింది" అని అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు విజయం సాధిస్తే తప్పితే ఇక పూజాను మరిచి పోవాల్సిందే అనే టాక్ పబ్లిక్‌లో వినిపిస్తోంది.