O Maara Lyrical: థగ్ లైఫ్.. నుంచి ఓ మారా సాంగ్ రిలీజ్
ABN, Publish Date - May 27 , 2025 | 10:43 PM
కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’.
కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’. 'నాయకన్’ చిత్రం వచ్చిన 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది.గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి హీరో శింబు పాత్రకు సంబంధించిన ఓ మారా అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేశారు. అస్కార్ విన్నర్ రెహామాన్ (AR Rahman) సంగీతం అందించారు.