Nayanthara: నయన్ విడాకుల వార్తలు.. ఫొటోతో కొట్టింది..
ABN, Publish Date - Jul 10 , 2025 | 08:32 PM
సినీ తారలకు సంబంధించి పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. కొందరు ఆ వార్తలపై, రియాక్ట్ అవుతుంటారు.
సినీ తారలకు సంబంధించి పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. కొందరు ఆ వార్తలపై, రియాక్ట్ అవుతుంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. తాజాగా నయనతార(nayanthara), విఘ్నేశ్ (Vignesh) దంపతులపై ఇలాంటి ఓ వార్త నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఈ జంట విడిపోనుందని కోలీవుడ్‌లో ఇటీవల ప్రచారం జరిగింది. వాటిపై నయనతార తాజాగా స్పందించారు. తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ ‘‘మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే’’ అంటూ ఆ వార్తల్ని ఖండించారు. నయన్ తన వివాహ బంధం గురించి ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది.
కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వదంతులకు దారితీసింది. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అంటూ పోస్టు పెట్టిన ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని డిలీట్ చేశారు. ఆ లోగా స్ర్కీన్‌షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరూ విడిపోతున్నానంటూ వార్తలు వచ్చాయి. ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో కలిసి 'మెగా 157'లో నటిస్తోంది. అలాగే యశ్ ‘టాక్సిక్’ చిత్రంలోనూ నటిస్తోంది.