Mn Rajam: అలనాటి నటీమణి రాజంకు..‘జీవిత సాఫల్య పురస్కారం’
ABN, Publish Date - Sep 17 , 2025 | 06:42 AM
అలనాటి నటీమణి ఎంఎన్ రాజం (MN Rajam)కు నడిగర్ సంఘం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనుంది.
అలనాటి నటీమణి ఎంఎన్ రాజం (MN Rajam)కు నడిగర్ సంఘం (Nadigar Sangam) ‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Achievement Award) ప్రదానం చేయనుంది. ఈ నెల 21న జరిగే నడిగర్ సంఘం సమావేశంలో ఆమెకు ఈ అవార్డు అందజేస్తారు. ఈ మేరకు ఎంఎన్ రాజంను నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్, కోశాధికారి కార్తి స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
కాగా, 1950 నుంచి 1960 వరకు అగ్రనటిగా కొనసాగిన రాజం.. ‘రత్తకన్నీర్’, ‘పెన్నిన్ పెరుమై’, ‘పుదైయల్’, ‘తంగపదుమై’, ‘నాడోడి మన్నన్’, ‘పాసమలర్’, ‘తాళి భాగ్యం’, ‘అలిబాబావుమ్ 40 తిరుడర్‌గలుం’, ‘అరంగేట్రం’ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన రాజం.. అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు. కాగా ఈ నెల 21న నడిగర్ సంఘ సర్వసభ్య సమావేశం తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో జరుగనుంది. ఇందులో అగ్రనటులు కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth)లకు సన్మానం తదితర అంశాలపై చర్చించనున్నారు.