Mohanlal: దీపావళి బరి నుండి.. తప్పుకున్న 'వృషభ'

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:25 PM

దీపావళికి రావాల్సిన మోహన్ లాల్ 'వృషభ' చిత్రం వాయిదా పడింది. ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

Mohanlal

కంప్లీట్ యాక్టర్, సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohanlal) న‌టిస్తున్న భారీ చిత్రం ‘వృషభ’ (Vrusshabha). రాగిణి ద్వివేది (Ragini Dwivedi), సమర్జిత్ లంకేష్ (Samarjit Lankesh) ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి. కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం నందకిశోర్ (Nanda Kishore). ఇటీవల వచ్చిన ఈ సినిమా టీజర్ తో అంచనాలు అంబరాన్ని తాకాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా మేకింగ్ గురించి మాట్లాడేట్టుగా ఈ టీజర్ చేసింది. ఆంటోనీ సామ్సన్ విజువల్స్, కె.ఎం. ప్రకాశ్‌ ఎడిటింగ్, సామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం, ఆస్కార్ విజేత రసుల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ అదిరిపోయాయంటూ కితాబిచ్చారు.


ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన ఏక్తా కపూర్ మాట్లాడుతూ, 'మా సంస్థ నుండి ఎప్పుడూ పవర్ ఫుల్ స్టోరీస్ ను ప్రేక్షకులకు అందించేందుకు కృషి చేస్తుంటాం. ఆ కోవకు చెందిందే 'వృషభ' చిత్రం కూడా. ఇది కేవలం సినిమా కాదు, ఎమోషన్స్, రిలేషన్స్, రివేంజ్, ఫ్రీడమ్ కోసం చేసే పోరాటం అన్నీ ఇందులో ఉన్నాయి. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులకు ఇది సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఖచ్చితంగా ఇస్తుందని చెప్పగలను' అని అన్నారు. ఈ సినిమా తనకు ఓ గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని దర్శకుడు నందకిశోర్ చెప్పారు. లెజెండరీ మోహన్ లాల్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తానని, ఆయన కొడుకు పాత్రను సమర్జిత్ అద్భుతంగా చేశాడని, ఇది తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే శక్తివంతమైన కథ అని ఆయన అన్నారు. మలయాళం, తెలుగు భాషల్లో ఒకేసారి దీనిని తీశామని, అయితే హిందీ, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు. నిజానికి దీపావళికి ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెప్పినా... ఇప్పుడు తాజాగా నవంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్టు తెలియచేస్తూ, నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Also Read: Krithi Shetty: డిసెంబర్ అమ్మడిదే...

Also Read: Upendra Re-Release: ఉపేంద్ర రీ రిలీజ్‌.. 25 ఏళ్ల తర్వాత కూడా కల్ట్ క్లాసిక్‌కు తెలుగులో భారీ రెస్పాన్స్!

Updated Date - Oct 09 , 2025 | 04:28 PM