Mohanlal: మోహన్‌లాల్ పాంచ్ పటాకా..ఈ ఏడాదిలో ఐదో సినిమా రిలీజ్
ABN, Publish Date - Oct 10 , 2025 | 12:41 PM
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) మరోసారి తన సత్తా చాటుకున్నాడు.
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) మరోసారి తన సత్తా చాటుకున్నాడు. 2025 సంవత్సరం ఆయన కేరీర్‌లోనే గోల్డెన్ ఇయర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వయసు మీద పడుతున్నా ఒకదాని తర్వాత మరోటి సినిమాలు చేస్తూ వాటిని రిలీజ్ చేసి అంతకుమించి విజయాలు సాధిస్తూ కుర్ర హీరోలకు సింహాస్వప్నంలా మారాడు. ఈ ఒక్క సంవత్సరమే కేరళ బాక్సాఫీస్ వద్ద ₹250 కోట్ల కలెక్షన్లు సాధించి మలయాళ నటులందరికీ ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు.
అదేవిధంగా ఏడాది ఆరంభంలో వచ్చిన L2-ఎంపురాన్ (86.25 కోట్లు), తుడరం (118.90 కోట్లు), చొట్ట ముంబై (రీ-రిలీజ్) ( ₹3.61 కోట్లు), తాజాగా హృదయపూర్వం (41.32 కోట్లు) సినిమాల విజయాలతో మోహన్‌లాల్ కేరళలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. గ్లోబల్ బాక్సాఫీస్‌లో మొత్తం ₹550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, మలయాళ సినిమాకు కొత్త శిఖరాలను చూపించి చరిత్ర సృష్టించారు. మలయాళ సినిమాలను కొత్త పుంతలు తొక్కించారు. అదేవిధంగా తెలుగు చిత్రం కన్నప్పలోనూ ఓ ప్రధాన పాత్రలోనూ నటించి మెప్పించాడు.
ఇదిలాఉండగా.. ఇదే కోవలో ఆయన మలయాళంలో నటించిన మరో సినిమా ‘వృషభ’ కూడా మరో నెలలో విడుదలకు సిద్దమైంది. ముందుగా దీపావళి కానుకగా థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకురావాలని భావించిన కొన్ని కారణాల వల్ల సినిమాను రెండు వారాలు పోస్ట్‌పోన్ చేసి నవంబర్ 6, 2025న ప్రపంచవ్యాప్తంగా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో.. మోహన్‌లాల్ వృషభ, విశ్వంభర రెండు ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండగా రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందనను దక్కించుకుంది. సామ్ సి.ఎస్ సంగీతం అందించాడు.
2025లో మోహన్‌లాల్ ఇప్పటివరకు ‘లూసిఫర్ 2’ – రూ.260 కోట్లు, ‘తుడరం’ – రూ.235 కోట్లు, ‘హృదయపూర్వం’ రూ.100 కోట్లు చొప్పున సాధించి రికార్డు నెలకొల్పాడు. త్వరలో రానున్న ఐదో చిత్రంగా ‘వృషభ’ విడుదల విజయం సాధఙస్తే గనుక మోహన్‌లాల్ ఒకే సంవత్సరం ఐదు హిట్లతో మరో అరుదైన అద్భుత రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.