Hridayapoorvam: మోహన్‌లాల్.. హృదయపూర్వం టీజర్ అదిరిపోయింది
ABN, Publish Date - Jul 19 , 2025 | 07:00 PM
ఎంపురాన్, తుడరుమ్ సినిమాల తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన నూతన చిత్రం హృదయ పూర్వం.
ఎంపురాన్, తుడరుమ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన నూతన చిత్రం హృదయ పూర్వం (Hridayapoorvam). సత్యం అంతికడ్ (Sathyan Anthikad) దర్వకత్వం వహించగా తమ సొంత నిర్మాణ సంస్థ అశీర్వాద్ సినిమాస్ (Aashirvad Cinemas) బ్యానర్‌పై అంటోని పెరుంబావూర్ (Antony Perumbavoor) నిర్మించాడు. జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran) సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగష్టు28న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. మాళవికా మోహనన్ (Malavika Mohanan), సంగీత్ ప్రతాప్ (Sangeeth Prathap), సంగీత, సిద్ధిఖ్, నిషాన్‌కీలక పాత్రల్లో నటించారు.
ఈ టీజర్‌ను గమనిస్తే.. మోహన్ లాల్ ఈ యేడు మరో కొత్త తరహా చిత్రంతో అలరించేందుకు రెడీ అయినట్లు అర్థమవుతోంది. టీజర్ ప్రత్యేకంగా ఇతర భాషల్లో రిలీజ్ చేయనవసరం లేకుండా ఇంగ్లీష్‌లోనే ఉండి అందరికీ ఇట్టే అర్థమ్యేలా ఉంది. టీజర్‌లో వచ్చిన సన్నివేశాలు సైతం మంచి ఫన్ తెప్పించేలా ఉన్నాయి. ఓ కాలేజీలో.. ఓ యువకుడు మోహన్‌లాల్‌ను ఉద్దేశించి మీరు కేరళ నుంచి వచ్చారా.. నాకు కేరళ అంటే ఇష్టం మలయాళ సినిమాలు బావుంటాయి, సెన్సిబుల్‌గా ఉంటాయి, ముఖ్యంగా ఫా ఫా (ఫహాద్ ఫాజిల్) అంటే ఇష్టమని చెబుతాడు. అందుకు మోహన్ లాల్ ఆయనే కాదు ఇంకా చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారని అనగా ఆ కుర్రాడు.. వాళ్లంతా కాదు ఫాఫా ఇజ్ బెస్ట్ అని చెప్పడం ఆపై మోహన్ లాల్ కోపంగా వెళ్లి పోవడం ఆపై మిగతా సన్నివేశాలు సైతం ఇంట్రెస్టింగ్ ఉండి, చూసే వారికి మంచి వినోదం అందించేలా ఉంది. మీరు ఇంకా టీజర్ చూడలేదా.. ఇప్పుడే చూసేయండి.