Patriot: మమ్ముట్టి, మోహన్‌లాల్ గట్టిగానే.. ప్లాన్ చేశారుగా
ABN, Publish Date - Oct 02 , 2025 | 04:44 PM
దాదాపు పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సూపర్‌స్టార్స్ మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సూపర్‌స్టార్స్ మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణ్ (Mahesh Narayanan) దర్శకత్వం వహించే ఈ భారీ మల్టీస్టారర్ గతేడాది అటు ఇటు ఇదే సమయంలో షూటింగ్ ప్రారంభమైంది. పెట్రియాట్ (Patriot) గా వస్తున్న ఈ సనిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దసరా పండుగను పురస్కరించుకుని గురువారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అడ్వంచర్‌గా వస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), కుంచకో బోబన్ (Kunchacko Boban), నయనతార (Nayanthara), రేవతి (Revathy) వంటి స్టార్స్ సైతం కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్ బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి వంటి లొకేషన్స్‌లో 150 రోజులకు పైగా షూటింగ్ చేశారు.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే.. మలయాళం నుంచి మరో బ్లాకబస్టర్ గ్యారంటీ అనేలా ఉంది. మోహన్ లాల్ మిలటరీ అధికారిగా, మమ్ముట్టి నేరస్థుడిగా ఓ మిషన్ కోసం పని చేసే వాడిగా కనిపించగా పాహాద్ ఫాజిల్ ఓ కంపెనీ హై అఫీసియల్‌గా కాస్త ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో కనిపించి సినిమాలో మ్యాటర్ బాగానే ఉండనుంది అని తెలుస్తోంది. యాక్షన్ సీన్లు సైతం భారీగానే ఉన్నాయి. కాగా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. మలయాళ స్టార్లు ఎక్కువగా ఈ మూవీలో నటిస్తుండడంతో చాలామంది అభిమానుల చూపు ఇప్పుడు ఈ చిత్రం పైనే ఉంది.