June Lockhart: హాలీవుడ్ లెజెండరీ నటి జూన్ లాక్‌హార్ట్ ఇకలేరు..
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:07 AM
హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి, లాసీ, లాస్ట్ ఇన్‌స్పేస్, పెట్టికోట్ జంక్షన్ వంటి సూపర్‌హిట్ టీవీ సిరీస్‌లతో విశేష గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ నటి జూన్ లాక్‌హార్ట్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు
హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి, లాసీ, లాస్ట్ ఇన్‌స్పేస్, పెట్టికోట్ జంక్షన్ వంటి సూపర్‌హిట్ టీవీ సిరీస్‌లతో విశేష గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ నటి జూన్ లాక్‌హార్ట్ (June Lockhart) 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృధాప్య సమస్యలతో ఈ నెల 23న సాంటా మోనికా, కాలిఫోర్నియాలో తన నివాసంలో మృతి చెందారు. లెజండరీ నటి మరణవార్తతో హాలీవుడ్ సినీ, టెలివిజన్ రంగం దిగ్భ్రాంతికి గురైంది. (hollywood Actress)
జూన్ లాక్‌హార్ట్ 1925 జూన్ 25న నూయార్క్ సిటీలో జన్మించారు. టీవీ, సినిమా రంగంలో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతి చిన్న వయసులో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 90 ఏళ్ల వయసు వరకూ నటిగా కొనసాగారు. 1938లో ‘ద కిస్టమస్ కరోల్’ చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 40కి పైగా చిత్రాలు, 80కిపైగా సీరియళ్ల, సిరీస్‌లతో మెప్పించారు. ‘ద కిస్టమస్ కరోల్’లో తన తల్లిదండ్రులతో కలిసి నటించి ప్రేక్షకుల్ని ఆకర్షించారు. ఆ తర్వాత ఆమె నటించిన ప్రాజెక్ట్‌లు వరుస విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా లాస్సీ సిరీస్‌లో రూత్ మార్టిన్ పాత్ర ఆమెకు అపారమైన పేరు తెచ్చింది. ఈ సిరీస్ ఇప్పటికీ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత గుర్తుంచుకునే క్లాసిక్ షోలో ఒకటిగా నిలిచింది. షి వోల్ఫ్ ఆఫ్ లండన్, వెగన్ ట్రైన్, గన్ స్మోక్ వంటి సినిమాలు. సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించారు. (June Lockhart is no more)

2016 తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మానేశారు. 2021లో వచ్చిన ‘లాస్ట్ ఇన్ స్పేస్’ సిరీస్‌తో మరో గొప్ప విజయం అందుకున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఆమెకు కొత్త తరం అభిమానులను పెంచింది. ఇదే ఆమె నటించిన చివరి సిరీస్. 90 ఏళ్లపాటు జూన్ లాక్‌హార్ట్ నటిగా కొనసాగారు. ఇది హాలీవుడ్‌లో అత్యంత అరుదైన ఘనతగా చెబుతారు. 2021 వరకూ కూడా ఆమె టెలివిజన్ రంగంలో యాక్టివ్‌గా ఉన్నారు. 1948లో స్పెషల్ టోనీ అవార్డును అందుకున్నారు. రెండుసార్లు ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యారు.
జూన్ లాక్‌హార్ట్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ‘ఆమె చివరి దశ వరకూ కూడా చాలా ఆనందంగా జీవితాన్ని గడిపారు. ప్రతిరోజూ న్యూ యార్క్ టైమ్స్, ఎల్.ఏ టైమ్స్ పత్రికలు చదివి సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. సహజమైన చిరునవ్వుల హృదయాన్ని తాకే నటన, శ్రద్థ, క్రమశిక్షణతో జూన్ లాక్‌హార్ట్ హాలీవుడ్‌లో చెరగని ముద్ర వేశారని హాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. ఆమె చలన చిత్ర రంగానికి అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు’ అని చెప్పారు.