Actor Srinivasan సీనియర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ ఇక లేరు
ABN, Publish Date - Dec 20 , 2025 | 12:26 PM
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ (69)కన్నుమూశారు.
మలయాళ (Mollywood)చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ (Srinivasan - 69)కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఆయన ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని త్రిపునితురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారు జామున శ్రీనివాసన్ శనివారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసన్ మృతితో మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
శ్రీనివాసన్ 1956, ఏప్రిల్ 6వ తేదీన కేరళలోని పట్యంలో జన్మించారు. సినిమాల మీద ఆసక్తితో చెన్నైలోని ఫిల్మ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1977లో విడుదలైన ‘మని ములక్కమ్’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 225 సినిమాల్లో నటించారు. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాదు రచయితగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా కూడా తన సత్తా చాటారు. రాష్ట్ర, జాతీయ అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు.