scorecardresearch

Rashmika Mandanna: కుర్ర హీరోయిన్స్ .. రశ్మికను చూసి నేర్చుకోండి 

ABN , Publish Date - Jun 22 , 2025 | 07:21 PM

ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున రశ్మిక మందన్న(Rashmika Mandanna) అని చెప్పుకొచ్చేస్తారు.

Rashmika Mandanna: కుర్ర హీరోయిన్స్ .. రశ్మికను చూసి నేర్చుకోండి 
Rashmika Mandanna

Rashmika Mandanna: ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున రశ్మిక మందన్న(Rashmika Mandanna) అని చెప్పుకొచ్చేస్తారు. గత కొన్నేళ్లుగా  రశ్మిక పట్టిందల్లా బంగారమే అని చెప్పొచ్చు. ఛలో (Chalo) సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన రశ్మిక.. గీత గోవిందం సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత  తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా ఆమె తన సత్తా చాటుతూ వస్తుంది. 


పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది  రశ్మిక.  అనిమల్, పుష్ప 2,  ఛావా సినిమాలతో వెయ్యి కోట్ల హీరోయిన్ గా మారిన ఈ చిన్నది  ఇప్పుడు కుబేర సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  రశ్మిక ఇంతగా సక్సెస్ ను అందుకోవడానికి ప్రధాన కారణం ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ అని చెప్పాలి. వరుస పాన్ ఇండియా సినిమా కథలను ఎంచుకోవడమే కాకుండా వాటిల్లో తన  పాత్రకు  ప్రాధాన్యత  ఉండేలా చూసుకుంటుంది. అదే ఆమెను  టాప్ లో నిలబెట్టాయి.


ఇక ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న ఏకైక  హీరోయిన్ రశ్మిక అని మాట్లాడుకుంటున్నారు.  బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా మంచి కథలను ఎంచుకొని వరుస విజయాలను  అందుకుంటుంది . ఇక రశ్మిక వరుస విజయాలను అందుకోవడం చూసినా కొందరునెటిజన్స్..ఆమెను చూసి  మిగతా హీరోయిన్స్ నేర్చుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. నిజం చెప్పాలంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారు ఇప్పుడు ఎవరూ లేరు .ఎందుకంటే వరుస  విజయాలను  అందుకున్న హీరోయిన్స్ తెలుగులో ఇప్పుడు  లేరు.  పూజా హెగ్డే ఐరన్ లెగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.  మృణాల్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఎలాంటి సినిమా చేయలేదు. అనుష్క, కాజల్, త్రిష, తమన్నా వీరందరూ తెలుగులో అప్పుడప్పుడు కనిపించడమే తప్ప వరుస విజయాలను దక్కించుకున్నది లేదు.


ఇక కుర్ర హీరోయిన్స్ గురించి అందరికీ తెలిసిందే. శ్రీలీల సినిమాలు చేస్తుంది కానీ విజయాన్ని అందుకోలేకపోతుంది. కృతి శెట్టి, వైష్ణవి చైతన్య లాంటివారు ఒక్క సినిమాకే పరిమితమయ్యారు.  వీరందరూ తెలుగులో ఒక హిట్ ఇచ్చి ఆ తర్వాత అంత పెద్ద హిట్ కోసం ఇప్పటికి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక సాయి పల్లవి విషయానికొస్తే ఆమె రష్మిక కన్నా చాలా సెలెక్టెడ్ గా కథలను ఎంచుకుంటూ వస్తుంది.   అందుకే ఆమె లెక్క వేరు అని చెప్పొచ్చు.  ఈ లెక్కన తెలుగులో నెంబర్ వన్ పొజిషన్ లో  ఉన్న ఏకక హీరోయిన్ రష్మిక అనే చెప్పాలి.


ప్రస్తుతం ఇండస్ట్రీలో  కొత్త హీరోయిన్లకు కానీ, ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ.. నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలంటే మాత్రం కథలను ఆచితూచి ఎంచుకోవాలి అనేది  రశ్మిక దగ్గరుండి నేర్చుకోవాల్సిందే.  ఏదిఏమైనా  రశ్మిక టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. 

Ashmita Karnani: నార్త్ హీరోయిన్స్ కి క్యారెక్టర్ ఉండదన్నాడు

Updated Date - Jun 22 , 2025 | 07:21 PM