సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AMB Bangalore: మ‌హేశ్‌బాబు.. బెంగ‌ళూరు మ‌ల్టీఫ్లెక్స్! ఇన్ని ప్ర‌త్యేక‌త‌లా

ABN, Publish Date - Dec 08 , 2025 | 10:45 PM

హైదరాబాద్‌ ప్రేక్షకులకు అత్యాధునిక సినీ అనుభవాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏఎంబీ సినిమాస్ ఇక‌పై బెంగళూరులోనూ సంద‌డి చేసేందుకు సిద్ధమైంది.

AMB Bangalore

హైదరాబాద్‌ ప్రేక్షకులకు అత్యాధునిక సినీ అనుభవాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏఏంబీ సినిమాస్ ( AMB Cinemas) ఇక‌పై బెంగళూరులోనూ సంద‌డి చేసేందుకు సిద్ధమైంది. ఆసియన్ సినిమాస్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ చైన్ ఇప్పటికే హైదరాబాద్‌లో టాప్ మూవీ డెస్టినేషన్‌గా మ‌న్న‌న‌లు పొందుతోంది.

ఇప్పుడు ఇదే కాంబోను రిపీట్ చేస్తూ త‌మ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ ఇప్పుడు బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తున్నారు. బెంగ‌ళూరు న‌డిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్‌కు డిసెంబర్ 16న ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్వయంగా విచ్చేయనున్నారని సమాచారం.

ప్ర‌త్యేక‌త‌లు

దేశంలో రెండో పెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఏఏంబీ బెంగ‌ళూరులో (AMB Bangalore) మల్టీప్లెక్స్‌లోని అన్ని స్క్రీన్లు అత్యుత్తమ సాంకేతికతతో ఏర్పాటు చేయ‌గా మొత్తం తొమ్మిది స్క్రీన్లు ఉండ‌నున్నాయి. వాటిలో ఒకటి డాల్బీ స్క్రీన్ 60 అడుగుల విస్తీర్ణంతో ఉండ‌నుండ‌డం విశేషం. ఇది పూణేలోని డాల్బీ స్క్రీన్ కంటే 5 అడుగులు పెద్దది కాగా భారతదేశంలో రెండో పెద్ద స్క్రీన్‌.

అంతేగాక‌.. అన్ని స్క్రీన్లలో 4K లేజర్ ప్రొజెక్షన్, నాలుగు స్క్రీన్లలో డాల్బీ అట్మాస్ సౌండ్, మిగతా నాలుగు స్క్రీన్లలో Dolby 7.1 సౌండ్తో అల‌రించ‌నున్నాయి. ఇక స్క్రీన్ 1 మరియు 2 ఫ్లాట్ స్క్రీన్లు కాగా డాల్బీ సినిమా స్క్రీన్‌లో డ్యూయల్ 4K Dolby Vision ప్రొజెక్టర్స్ ఉండి Dolby 3D సపోర్ట్, 64 ఛానల్ Atmos సౌండ్ సెటప్ ప్ర‌త్యేకత‌లు క‌లిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఏఏంబీ సినిమాస్ ఒక‌టి విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుండ‌గా రానున్న సంక్రాంతికి 7 స్క్రీన్ల‌తో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లో ఏర్పాటు చేసిన మ‌రో మ‌ల్టీఫ్లెక్స్ సైతం ఓపెన్ అవ‌నుండ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Dec 08 , 2025 | 10:45 PM