Maharaja 2: విజయ్ సేతుపతి.. మహరాజా 2! ఇది కదా న్యూస్
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:17 PM
తమిళ నటుడు విజయ్ సేతుపతి 50వ చిత్రంగా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలను షేక్ చేసిన చిత్రం ‘మహరాజా’
తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) 50వ చిత్రంగా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలను షేక్ చేసిన చిత్రం ‘మహరాజా’ (Maharaja). అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap), మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas), అభిరామి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంతో నిథిలన్ స్వామినాథన్ (Nithilan Saminathan )దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఓ మాములు చిత్రంగా ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ సినిమా రూ.20 కోట్ల బడ్జెట్‌లో నిర్మితమై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
అయితే.. తాజాగా విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్నట్లు దానికి టైటిల్ ఫిక్స్ కూడా చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ కొత్త చిత్రానికి మహారాజ2 ((Maharaja 2) అని తెలుస్తుండగా ఇప్పటికే నిథిలన్ చెప్పిన స్టోరీకి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ స్క్రిప్టు పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉండగా త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండనున్నట్లు సమాచారం.
ఈ వార్తతో ఇప్పుడు ఈ కాంబోపై అంచనాలు ఓ రేంజ్లో ప్రారంభమయ్యాయి. ఇదిలాఉండగా ఇటీవలే ఏస్ సినిమాతో పలకరించిన విజయ్ సేతుపతి థియేటర్‌లో మెప్పించలేక పోయిన ఓటీటీలో మంచి ప్రేక్షకాధరణను దక్కించుకుంటోంది. ఇఇవే కాక తమిళంలో మిస్కిన్, పాండిరాజ్ వంటి దర్శకులతో పాటు తెలుగులో పూరి జగన్నాధ్ ( Puri Jagannadh) డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు పూర్తి చేసిన అనంతరం మహారాజ2 ((Maharaja 2) సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.