సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

lIaiyaraaja: ఆ పాటను అనుమతి లేకుండా ఉపయోగించారు

ABN, Publish Date - Jul 12 , 2025 | 01:43 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోమారు హైకోర్టును ఆశ్రయించారు...

హైకోర్టుకెక్కిన ఇళయరాజా

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రముఖ నటి వనిత విజయకుమార్‌, కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌ మాస్టర్‌ జంటగా నటించిన ‘మిసెస్‌ అండ్‌ మిస్టర్‌’ శుక్రవారం విడుదలైంది. ఇందులో తాను సంగీతం సమకూర్చిన ‘మైఖేల్‌ మదన కామరాజన్‌’ చిత్రంలోని ఓ పాటను తన అనుమతి లేకుండా వాడారని, ఇది కాపీరైట్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని, అందువల్ల ఆ పాటను తొలగించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇళయరాజా తరపు న్యాయవాది ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసి, తక్షణ విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సెంథిల్‌ కుమార్‌ సోమవారానికి వాయిదా వేశారు.

Updated Date - Jul 12 , 2025 | 01:43 AM