Idli Kottu: కొత్తగుందే పాత లోకం అంతా.. లిరికల్ సాంగ్! శ్వేతా మోహన్ మరోసారి అదరగొట్టింది
ABN, Publish Date - Sep 11 , 2025 | 03:52 PM
కుబేర వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ఇడ్లీ కొట్టు.
కుబేర వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ఇడ్లీ కొట్టు (Idli Kottu). నిత్యా మీనన్ (Nithya Menon), శాలినీ పాండే (Shalini Pandey)లు కథానాయికలు. అరుణ్ విజయ్ (Arun Vijay), సత్యరాజ్, రాజ్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి కొత్తగుందే పాత లోకం అంతా.. ఇంతకాలం చూడలేదే వింత అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు సామ్రాట్ నాయుడు (Samrat Naidu) సాహిత్యం అందించగా జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతంలో కృష్ణ తేజస్వీ (Krishna Tejasvi), శ్వేత మోహన్ (Shweta Mohan) ఆలపించారు. కాగా ఈ సినిమా ఆక్టోబర్1న ప్రేక్షకుల ఎదుటకు రానుంది.