Kotha Lokah Chapter 1 Trailer: ఆడవాళ్లు రెండు రకాలు.. అదిరిపోయిన కొత్త లోక ట్రైలర్
ABN, Publish Date - Aug 26 , 2025 | 09:26 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)ఒకపక్క హీరోగానే కాకుండా ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ లో మంచి మంచి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
Kotha Lokah Chapter 1 Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)ఒకపక్క హీరోగానే కాకుండా ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ లో మంచి మంచి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా దుల్కర్ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కొత్త లోక చాఫ్టర్ 1: చంద్ర (Kotta Lokah). కళ్యాణి ప్రియదర్శి (Kalyani Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమలు ఫేమ్ నెస్లన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కొత్త లోక అన్ని భాషల్లో ఆగస్టు 29 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ రెండు రోజుల క్రితమే మలయాళ ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు సూపర్ మ్యాన్ ను చూశారు కానీ.. మొట్ట మొదటిసారి సూపర్ విమెన్ గా కళ్యాణి కనిపించనుంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ తో పాటు కామెడీ కూడా నింపినట్లు తెలుస్తోంది.
సూపర్ పవర్స్ ఉన్న యువతీ లోక. తన ప్రపంచంలో తాను నివసిస్తుండగా.. పెద్దాయన ఆమెను మనుషులు ఉండే దగ్గరకు రప్పిస్తాడు. కొన్నిరోజులు లో ప్రొఫైల్ లో ఉండమని, ఎలాంటి సమస్యలో ఇరుక్కోవద్దని ఆర్డర్ వేయడంతో ఆమె హీరో ఎదురు ప్లాట్ లో దిగుతుంది. మొదటి చూపులోనే హీరో.. లోకను ఇష్టపడతాడు. అయితే ఆమె సామాన్య యువతీ కాదని కనిపెడతాడు. ఈలోపులో లోకకు ఎదురైన సమస్య ఏంటి.. ? దానికి హీరోకు ఉన్న సంబంధం ఏంటి.. ? అసలు లోక ఎవరు.. ? ఆమెను పెద్దాయన ఎందుకు పిలిచాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సాధారణంగా సూపర్ హీరోలు యాక్షన్ సీన్స్ చేస్తుంటే ఫుల్ మజా వస్తుంది. ఈ సినిమాలో కళ్యాణి యాక్షన్ సీన్స్ చేస్తుంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక ఆమెకు తోడుగా నెస్లన్.. వారిద్దరి మధ్య కనెక్షన్ బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఇక లోకగా కళ్యాణి లుక్, వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. టోటల్ గా ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ సినిమాతో కళ్యాణి సూపర్ విమెన్ గా హిట్ కొడుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
Alia Bhatt: ఆ వీడియోలను షేర్ చేయకండి.. మీకు అలా జరిగితే ఊరుకుంటారా