సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kollywood: కోలీవుడ్‌లో విషాదం.. ఒకేరోజు ఇద్దరు ప్రముఖుల కన్నుమూత

ABN, Publish Date - Oct 24 , 2025 | 05:53 AM

త‌మిళ సినీ పరిశ్రమలో విషాదం. సంగీత దర్శకుడు ఎం.సి. సబేష్, దివంగత నటి మనోరమ కుమారుడు నటుడు భూపతి ఒకేరోజు కన్నుమూయడంతో కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.

kollywood

త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేరోజు సినీ సంగీత దర్శకుడు సబేష్ (M C Sabesan), దివంగత నటి మనోరమ (Manorama) కుమారుడు, నటుడు భూపతి (Boopathi) ఒకేరోజు కన్నుమూయడంతో కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.

మ్యూజీషియన్ సంఘం అధ్యక్షుడు, సం గీత దర్శకుడు సబేష్ (68) గురు వారం కన్నుమూశారు. సబేష్ ఇటీవల అనారో గ్యానికి గురికావడం తో నగరంలోని ప్రైవేటు ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ. గురువారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం వలసరవాక్కంలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. ఆయనకు భార్య గీత, ఆర్చన, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలున్నారు. సణేష్ అంత్యక్రియలు ఈ రోజు (శుక్రవారం) వలసరవాక్కం, బృందావన్ నగర్ లోని శ్మశానవాటికలో జరుగనున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా సంగీతం సమకూర్చిన అనేక హిట్ పాటల వెనుక సబేష్ పాత్ర ఎంతో ఉంది. అలాగే, సబేష్ తన సోదరుడు మురళితో కలిసి పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. వీటిలో 'హింసై అరసన్ 23వ పులకేశి, 'మాయాండి కుడుంబత్తార్', 'గోరిపాళ్యంస‌, తవమాయ్ తవ మిరుందు, పొక్కిషం', 'ఆటోగ్రాఫ్' 'వంటి అనేక హిట్ చిత్రాలున్నాయి.

ఇదిలా ఉండగా దివంగత సీనియర్ నటి మనోరమ ఏకైక కుమారుడు భూపతి (70) (Boopathi)గురువారం మృతి చెందారు. భూపతి అనారోగ్యం కారణంగా గత వారం నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన టి.నగర్ నీలకంఠ మెహతా స్ట్రీట్‌లో ఉన్న తన నివాసంలో తన తల్లి ఉపయోగించిన మంచం పైనే పడుకుని తుదిశ్వాస విడిచారు. నటుడు విసు తరకెక్కించిన 'కుడుంబం ఒరు కదంబం' అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన భూపతి.. పలు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలతో పాటు పలు సీరియల్స్‌లో నటించారు.

భూపతి భౌతికకాయానికి నడిగర్‌ సంఘం కోశాధికారి, హీరో కార్తి, ఉపాధ్యక్షులు పూచ్చి మురుగన్, కరణాస్ మూలమాల వేసి నివాళులుర్పించారు. భూపతికి కుమారుడు రాజరాజన్, కుమార్తెలు అభిరామి, మీనాక్షి ఉన్నారు. శుక్రవారం టి.నగర్ లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Updated Date - Oct 24 , 2025 | 07:24 AM