సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Madhan Bob: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ABN, Publish Date - Aug 02 , 2025 | 08:41 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ మదన్ బాబ్(Madhan Bob) (71) కన్నుమూశారు.

Madhan Bob

Madhan Bob: కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ మదన్ బాబ్(Madhan Bob) (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న మదన్.. చికిత్స పొందుతూ చెన్నైలోని ఆయన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్ బాబ్ మరణ వార్త విన్న కోలీవుడ్ తీవర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


మదన్ బాబ్ అసలు పేరు ఎస్. కృష్ణమూర్తి. ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా ఆయన టీవీ రంగానికి పరిచయం అయ్యాడు. ముఖం, కళ్లు తిప్పుతూ విచిత్రమైన హావభావాలను ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్ గా మారాడు. స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ పాత్రలలో నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. జెమిని, ఆరు, మిస్టర్ రోమియో, లింగ, తెనాలి, ఫ్రెండ్స్, ఘోస్టీ, రాయన్ తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో మదన్ బాబ్ ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 08:41 PM