సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss Kannada: అనుమ‌తులు లేకుండా బిగ్ బాస్ షో.. తాళం వేసిన అధికారులు

ABN, Publish Date - Oct 08 , 2025 | 10:42 AM

క‌న్న‌డ అగ్ర న‌టుడు సుదీప్ హోస్టింగ్‌లో ఉత్సాహంగా ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షో 12వ సీజన్ కు బ్రేక్ పడింది.

Bigg Boss Kannada

వారం క్రితం క‌న్న‌డ అగ్ర న‌టుడు సుదీప్ (Kiccha Sudeep) హోస్టింగ్‌లో ఉత్సాహంగా ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ (Bigg Boss Kannada)రియాల్టీ షో 12వ సీజన్ కు బ్రేక్ పడింది. పోలీసు శాఖతో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోకుండా షో నిర్వహిస్తుండడంతో.. అధికారులు మంగళవారం బిగ్ బాస్ హౌస్‌కు తాళం వేశారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిగ్ బాస్ హౌస్‌ను మూసి వేసేందుకు అధికారులు అక్కడకు వెళ్లగా, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు బయటకు రాలేదు. చివరకు రాత్రి సమయంలో నిర్వాహకులు వారికి బయటకు తరలించారు.

బెంగళూరు దక్షిణ (రామనగర్) జిల్లా బిడది (Bidadi) పారిశ్రామిక వాడలోని జాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ పార్కులో బిగ్ బాస్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి తీసుకోనందుకు కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి అధి కారులు ఇటీవల షో నోటీసులు జారీ చేశారు. వీటికి నిర్వాహకులు స్పందించ లేదు. దీనికి తోడు షో నిర్వహణకు పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా కఠిన చర్యలు చేపట్టారు.

తొలుత తహసీల్దారు తేజస్విని నేతృత్వంలో అధికారులు మంగళవారం బిగ్ బాస్ హౌస్‌ వద్దకు వెళ్లగా ఆ త‌ర్వాత‌ రామనగర్, బిడది పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్లు అందరూ హౌస్ నుంచి గంటలోగా బయటకు రావాలని పోలీసులు హెచ్చరించారు. కాసేపటి త‌ర్వాత‌ అడిషనల్ ఎస్పీ రామచంద్రప్ప సైతం అక్కడికి రాగా.. పోలీసులిచ్చిన సమయం ముగిసినా కంటెస్టెంట్లు బయటకు రాకపోవడంతో అదికారులు హౌస్‌కు తాళం వేశారు. రాత్రి ఎనిమిది గంటల సమ యంలో నిర్వాహకులు కంటెస్టెంట్ లందరినీ అక్కడి నుంచి ఓ థియేటర్కు తరలించారు.

కర్ణాటకలో బిగ్ బాస్ హౌస్‌ షోకు ప్రత్యేక ఆదరణ ఉంది. గత 11 సీజన్లలో అంతా సక్రమంగా జరిగిపోగా.. 12వ సీజన్‌కు ఆదిలోనే అవాంతరం ఏర్పడింది. దీంతో తిరిగి ఈ షో కొన‌సాగుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే 'ఎక్స్ 'లో స్పందిస్తూ.. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. బిగ్ బాస్ హౌస్‌ నిర్వాహకులకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని, అందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 10:55 AM