Toxic: ‘టాక్సిక్’.. కియారా లుక్ వచ్చేసింది
ABN, Publish Date - Dec 21 , 2025 | 02:23 PM
కన్నడ స్టార్ యశ్ (Yash) హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్.
కన్నడ స్టార్ యశ్ (Yash) హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్. యశ్ నటిస్తున్న 19వ చిత్రమిది. వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కియారా ఆడ్వాణీ (Kiara Advani) కథానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఆమె నదియా అనే పాత్రలో నటిస్తున్నారని (Kiara Advani as Nadia) పోస్టర్లో తెలిపారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు నాయికలకు ఆస్కారం ఉందని టాక్ నడిచింది. కరీనా కపూర్, నయనతార, శ్రుతి హాసన్ తదితర పేర్లు వినిపించాయి. ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కియారాను పరిచయం చేసినట్లే పోస్టర్లతోనే మిగతా హీరోయిన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.