సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

KGF Harish Rai: కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ కన్నుమూత

ABN, Publish Date - Nov 06 , 2025 | 03:19 PM

ప్రముఖ కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్‌ రాయ్‌ కన్నుమూశారు.

ప్రముఖ కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ (KGF fame) హరీశ్‌ రాయ్‌ (Harish Rai) కన్నుమూశారు. గత కొంతకాలంగా థైరాయిడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన (Harish Rai) గురువారం తుదిశ్వాస విడిచారు. 2022 నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ  విషయాన్నీ ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా.. కొందరు నటులు సాయం చేశారు. 1995లో వచ్చిన ‘ఓం’ సినిమాలో డాన్‌ రాయ్‌గా, ‘కేజీఎఫ్‌’లో ఖాసిం చాచాగా (KGF Chacha) నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.  (Actor Harish Rai is nomore)

'విధి రాత నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ‘కేజీఎఫ్‌’లో నేను గడ్డంతో కనిపించడానికి  కారణం ఉంది. క్యాన్సర్‌ కారణంగా నా గొంతు వాచిపోయింది. అది కనపడకుండా ఉండేందుకు గడ్డం పెంచాను. ‘పరిస్థితులు కొన్నిసార్లు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయి. అని ఓ ఇంటర్వ్యూ లో హరీశ్ అన్నారు. 

Updated Date - Nov 06 , 2025 | 03:33 PM