Keerthy Suresh: ఓటీటీలో ఉప్పుకప్పురంబు...
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:39 AM
వైవిధ్యమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు సహాస్. అలానే కీర్తి సురేశ్ సైతం వైవిధ్యానికే ప్రాధన్యమిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన 'ఉప్పు కప్పురంబు' సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోంతోంది.

సుహాస్ (Suhas), కీర్తి సురేశ్ (Keerthy Suresh), బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu). ఐ.వి. శశి (I.V. Sasi) దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్ పై రాధిక లావు నిర్మించిన ఈ సినిమాకు వసంత్ మారింగంటి రచన చేశారు. ఈ మూవీ జూలై 4 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.
1990 నాటి కథాంశంతో 'ఉప్పుకప్పురంబు' సినిమా రూపుదిద్దుకుంది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతం మైన చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలో ఈ కథ సాగుతుంది. తెలుగులో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి ప్రైమ్ వీడియలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. చమత్కారం, హాస్యం తో నిండిన 'ఉప్పు కప్పురంబు'లో దర్శకుడు ఓ సామాజిక సమస్యను ప్రధానాంశంగా తీసుకున్నారు. అయితే అందరూ మెచ్చే విధంగా, ఆమోదయోగ్యంగా అది ఉంటుందని అంటున్నారు. దీని గురించి ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ అండ్ ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ మాట్లాడుతూ, 'ఉప్పు కప్పురంబు అనేది ఆలోచింపజేసే, ఆహ్లాదకరమైన, విచిత్రమైన వ్యంగ్య రూప చిత్రం. ఇది ప్రామాణికమైన గ్రామీణ వాతావరణ సారాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో ఒక అసాధారణమైన ఇతివృత్తాన్ని తెరపైకి తెస్తుంది. ఎల్లనార్ ఫిల్మ్స్‌తో కలిసి పనిచేయడం, కీర్తి సురేష్, సుహాస్ వంటి ప్రతిభావంతులైన తారాగణంతో ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది' అని అన్నారు.
Also Read: The Raja Saab: ప్రభాస్.. ది రాజా సాబ్ టీజర్ వచ్చేసింది!
ఇందులో తాను చర్చించింది ఓ సామాజిక సమస్య గురించే అయినా.. దానిని సింపుల్ గా, కార్టూనిష్ మార్గంలో చెప్పడానికి ప్రయత్నించానని, దీనిని ప్రైమ్ వీడియో స్క్రీమింగ్ చేయడం సంతోషంగా ఉందని దర్వకుడు ఐ.వి. శశి చెప్పారు.
Also Read: The Raja Saab: మారుతి గ్రోత్ మాములుగా లేదుగా...