Kayadu Lohar: టాస్మాక్ స్కామ్.. హద్దులు దాటారు
ABN, Publish Date - Nov 18 , 2025 | 04:11 PM
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ (Dragon) సినిమాతో కయాదుకి మంచి గుర్తింపు వచ్చింది.
Kayadu Lohar: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ (Dragon) సినిమాతో కయాదుకి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటివరకు అమ్మడు ఎవరో కూడా తెలియని తెలుగు అభిమానులు సైతం ఆల్రెడీ ఈ చిన్నది తెలుగులో అల్లూరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిందని తెలిసి షాక్ అయ్యారు. ఇక నేమ్,ఫేమ్ వచ్చాయి అంటే ఆరోపణలు రావడం కూడా సాధారణమే. గత కొన్నిరోజులుగా కయాదుపై ట్రోల్ల్స్ వస్తున్న విషయం తెల్సిందే.
మద్యం రిటైలర్ టాస్మాక్ ( TASMAC) తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ కుంభకోణంలో కయాదు లోహర్ పేరు వినిపించడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. టాస్మాక్ స్కామ్ లో ఉన్నవారు చేసే పార్టీలకు కయాదు హాజరు అయ్యేదని, ఆ పార్టీలో గంట ఉన్నందుకు ఆమె రూ. 35 లక్షలు తీసుకొనేదని రూమర్స్ వచ్చాయి. దీంతో కయాదుపై భారీగా ట్రోల్ల్స్ వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కయాదు ఈ వార్తలను ఖండించింది. సపోర్ట్ లేకుండా వచ్చిన తనపై బ్లాక్ మర్క్స్ వేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ' ఇలాంటి ఒక విషయం నన్ను ఇంతగా దెబ్బతీస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిద్రలో కూడా నాకు జనాలు నా గురించి మాట్లాడుకుంటున్నవే గుర్తొస్తున్నాయి. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అసలు ఎలాంటి బాధ లేకుండా ఈజీగా తీసుకుంటారు అనుకుంటారు. కానీ, అది చాలా కష్టం.ఎందుకంటే నేను ఎవరి గురించి ఎప్పుడూ ఇలా ఆలోచించను.
నా కలలను నెరవేర్చుకోవడం కోసమే నేను కష్టపడుతున్నాను. అంతకు మించి నేనేం తప్పు చేసానో నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే నేను ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఈ ఆరోపణలు రావడం నాకు చాలా బాధ అనిపించింది. నేను ఈ సినిమా సర్కిల్ నుండి రాలేదని నాకు తెలుసు, అవును, జనాలు నాలాంటి కళాకారులపై సులభంగా నల్ల మచ్చలు వేయవచ్చు. కానీ అది హద్దులు దాటి వెళ్లకూడదు' అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.