Vaa Vaathiyaar: కార్తీ.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదయ్యా
ABN, Publish Date - Nov 17 , 2025 | 07:03 PM
కోలీవుడ్ స్టార్ హీరోల్లో కార్తీ (Karthi) కూడా కొనసాగుతున్న విషయం తెల్సిందే. అంత స్టార్ హీరో అయినా కూడా తన సినిమా రిలీజ్ చేయించుకోలేకపోతున్నాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
Vaa Vaathiyaar: కోలీవుడ్ స్టార్ హీరోల్లో కార్తీ (Karthi) కూడా కొనసాగుతున్న విషయం తెల్సిందే. అంత స్టార్ హీరో అయినా కూడా తన సినిమా రిలీజ్ చేయించుకోలేకపోతున్నాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కార్తీ విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే అతని చివరి సినిమా భారీ సిజాస్టర్ ని అందుకోవడం ఆయన గ్రాఫ్ ని తగ్గించేసిందని కోలీవుడ్ మీడియా మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం కార్తీ నటిస్తున్న చిత్రాల్లో వా వాతియార్ ఒకటి. నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కృతి శెట్టి నటిస్తోంది. అమ్మడు ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత వా వాతియార్ డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది. ఇంకో నెలలో రిలీజ్ పెట్టుకొని సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషన్ కూడా మేకర్స్ చేయడం లేదు.
అందుతున్న సమాచారం ప్రకారం వా వాతియార్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదేరోజు అఖండ 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. దాంతో పోటీ ఎందుకు అని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాకుండా రెండేళ్లుగా షూటింగ్ చేస్తున్నా ఇంకా ప్యాచ్ వర్క్ అలానే మిగిలి ఉందని.. దాన్నే ఇప్పటికీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇంకోపక్క కార్తీ అంతకు ముందు ప్లాపులను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్ కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదట. ఇది కూడా ఈ సినిమాను వాయిదా వేయడానికి ఒక కారణం అని అంటున్నారు. ఇలా కార్తీ సినిమాకు అన్ని గండాలే ఉన్నాయి. దీంతో ఈ విషయంతెల్సిన వారందరూ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ ఉంటుందో లేదో చూడాలి.