Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1 తొలి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:57 PM
షబ్‌శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. తొలి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..
రిషబ్‌శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1 Collections). రుక్మిణి వసంత్ కథానాయికగా హోంబలే ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు వరల్డ్‌వైడ్ రూ.89 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కన్నడ చిత్రానికి ఫస్ట్ డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం విశేషమని విశ్లేషకులు చెబుతున్నారు. 24 గంటల్లో ‘బుక్‌మై షో’లో 1.28 మిలియన్‌కిపైగా టికెట్లు సేల్ అయ్యాయి. ఈ పోర్టల్ వేదికగా ఈ ఏడాదిలో ఈ రేంజ్‌లో టికెట్లు సేల్ కావడం ఓ రికార్డుగా చెబుతున్నారు.
ఈ జాబితాలో.. తొలి స్థానంలో ‘పుష్ప 2’ (1.75 మిలియన్ టికెట్లు) నిలిచింది. రెండో స్థానంలో ‘కాంతార చాప్టర్ 1’, ఆ తర్వాత స్థానాల్లో జవాన్ (1.14 మిలియన్ టికెట్లు), కల్కి 2898 ఏడీ (1.12 మిలియన్ టికెట్లు) ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రేక్షక లోకాన్నే కాకుండా సెలబ్రిటీలను సైతం మెప్పించింది. ఎన్టీఆర్, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా వంటి సినీ ప్రముఖులు రిషబ్‌శెట్టికి, సినిమా యూనిట్‌ను అభినందిస్తూ పోస్ట్‌లు పెట్టారు. కన్నడ చిత్ర పరిశ్రమ, భారతీయ సినీ రంగంలో ‘కాంతార చాప్టర్ 1’ బెంచ్‌మార్క్‌లాంటిదని యశ్ అన్నారు. నటీనటులు సాంకేతిక నిపుణులను ప్రశంసించారు.