Sudeepa: సౌత్ స్టార్స్‌పై.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
ABN, Publish Date - Dec 28 , 2025 | 04:03 PM
ఒకప్పుడు కేవలం కర్ణాటకకే పరిమితమైన కన్నడ సినిమా ఇప్పుడు ‘కేజీఎఫ్’, ‘కాంతార‘ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది.
ఒకప్పుడు కేవలం కర్ణాటక (Karnataka) కే పరిమితమైన కన్నడ సినిమా (Kannada movie) ఇప్పుడు ‘కేజీఎఫ్’ (KGF), ‘కాంతార‘ (Kanthara) వంటి చిత్రాలతో పాన్ ఇండియా (Pan India) స్థాయిలో సత్తా చాటుతోంది. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో కన్నడ చిత్రసీమ ఒక వెలుగు వెలుగుతోంది. అయితే, తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇతర భాషా చిత్రాల్లో కన్నడ నటులు కనిపిస్తున్నంతగా, ఇతర ఇండస్ట్రీల స్టార్స్ కన్నడ సినిమాల్లో కనిపించడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప్ స్టార్ల మధ్య ఉండాల్సిన పరస్పర సహకారంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను తెలుగు (Telugu), హిందీ (Hindi), తమిళ (Tamil) చిత్రాల్లో ఎన్నో సార్లు అతిథి పాత్రలు చేశాను. కొన్ని సినిమాల్లో అయితే కనీసం రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా, కేవలం స్నేహం కోసమే నటించాను. శివ రాజ్ కుమార్ (Shiva Raj Kumar) గారు కూడా ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలో చేస్తున్నారు.
కానీ, అదే రీతిలో ఇతర ఇండస్ట్రీల నుంచి ఎవరూ మా సినిమాల్లో నటించేందుకు ముందుకు రావడం లేదు‘ అని సుదీప్ పేర్కొన్నారు. కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా, తాను స్వయంగా అడిగినా ఎవరూ రాలేదని సుదీప్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినప్పటికీ, ఇతర భాషా స్టార్స్ మా సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. ఇండస్ట్రీల మధ్య ఉండాల్సిన పరస్పర సహాయం లోపించిందని నాకు అనిపిస్తోంది‘ అని ఆయన అన్నారు.
సుదీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన సఈగస (Eega) సినిమాతో సుదీప్ ఇక్కడ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే ప్రభాస్ (Prabhas), చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్ల సినిమాల్లోనూ ఆయన కనిపించారు. మరి సుదీప్ చేసిన ఈ విన్నపంపై ఇతర ఇండస్ట్రీ స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. కన్నడ సినిమా ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా దూసుకుపోతున్న తరుణంలో, స్టార్స్ అందరూ కలిసి పనిచేస్తే ఇంకా బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.