Raju Talikote: షూటింగ్ స్పాట్‌లో గుండెపోటు.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ABN, Publish Date - Oct 14 , 2025 | 08:17 AM
ప్రముఖ రంగస్థల కళాకారుడు, హాస్యనటుడు, బిగ్‌బాస్7 కంటెస్టెంట్ రాజుతాళికోటె సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు.
ప్రముఖ రంగస్థల కళాకారుడు, హాస్యనటుడు, బిగ్‌బాస్7 కంటెస్టెంట్ రాజుతాళికోటె (Raju Talikote) సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు. విజయపుర జిల్లా సింధగి తాలూకా చిక్కసింధగి గ్రామానికి చెందిన రాజు తాళికోటె (62) నాటక రంగంతో పాటు సినిమాలతో ప్రము ఖనటుడిగా పేరొందారు.
ఆయన అసలుపేరు రాజేసాబ్ మక్తుంసాబ్ యంకంచి. ఉడుపిలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత విశ్రాంతి తీసుకుంటుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే మణిపాల్ ఆసుపత్రికి సహచర నటులు తీసుకెళ్లారు. అప్పటికే రాజు తాళికోటె మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు.
మనసారా, పంచరంగి, మందు మదువైనా, మైనా వంటి సినిమాలలో నటించారు. ఉత్తర కర్ణాటక నాటక మండలిలో, ధారవాడ రంగాయణ డైరెక్టర్‌గా కొనసాగారు. మద్యం మత్తులో నటించే పాత్రలతో ఆయన సుపరిచితులు.