Kalyani Priyadarshan: అప్పుడు టెన్షన్ తగ్గడంతో బయటికి వచ్చాం
ABN, Publish Date - Dec 19 , 2025 | 04:11 PM
ఈ ఏడాది సూపర్‌హిట్ అయిన అనువాద చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్1’ (Kothalok: Chapter 1) ఒకటి. తెలుగులోనూ ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించింది
ఈ ఏడాది సూపర్‌హిట్ అయిన అనువాద చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్1’ (Kothalok: Chapter 1) ఒకటి. తెలుగులోనూ ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని (Kalyani Priyadarshan) ఈ సినిమాలో నటించడం గురించి చెప్పుకొచ్చారు. ‘ఈ చిత్రంలో సూపర్ హీరోగా నన్ను అంగీకరిస్తారో లేదో అని ప్రతి నిమిషం భయపడ్డా. రివ్యూలు వచ్చే సమయానికి భయంతో గదిలో నుంచి బయటకు కూడా రాలేదు. నేను కాదు.. మా చిత్ర బృందం మొత్తం అలానే టెన్షన్ పడ్డాం. మేం ఎంత భయపడ్డామో అంత పాజిటివ్ స్పందన వచ్చింది. రివ్యూలు చూశాక మా ఆందోళన మొత్తం మాయమైంది. స్పందన ఎలా ఉన్నా విమర్శలు రాకుండా ఉంటే చాలనుకున్నాం. మధ్యాహ్నం 3 తర్వాత అందరం గదిలో నుంచి బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం’ అని కల్యాణీ ప్రియదర్శన్ తెలిపారు.
సాధారణ సినిమాగా వచ్చి భారీ విజయం సాధించి రికార్డులు తిరగరాసింది ‘కొత్తలోక: చాప్టర్ 1’. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళీ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం ‘జియో హాట్‌స్టార్’లో స్ర్టీమింగ్ అవుతోంది.