సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirage: జీతూ జోసెఫ్.. మైండ్ బెండింగ్ థ్రిల్లర్ 'మిరేజ్' ట్రైల‌ర్ చూశారా

ABN, Publish Date - Sep 14 , 2025 | 06:25 PM

జీనియ‌స్ సౌత్ టాప్ డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ (Jeetu Joseph) ఏడాది గ్యాప్ తర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'మిరేజ్'.

Mirage

ఇప్ప‌టికే థ్రిల్ల‌ర్ సినిమాల‌కు కేరాఫ్ ఆడ్ర‌స్‌గా నిలిచిన జీనియ‌స్ సౌత్ టాప్ డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ (Jeetu Joseph) ఏడాది గ్యాప్ తర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'మిరేజ్' (Mirage). ఆసిఫ్ అలీ (Asif Ali), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) జంట‌గా న‌టించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబ‌ర్ 19న మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌కు రానుంది. మైండ్-బెండింగ్ థ్రిల్లర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం ట్రైల‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌ను ప‌రిశీలిస్తే.. జీతూ జోసెఫ్ గ‌త చిత్రాల మాదిరిలోనే ఈ సినిమా కూడా అదిరిపోయే ట్విస్టుల‌తో, సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఓ మిస్సింగ్ కేసు గురించి అప‌ర్ణ‌తో క‌లిసి ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్న‌హీరో నేప‌థ్యంలో ఉత్కంఠభరితంగా సినిమా ఉండ‌నుంది. హీరో ఇన్వెస్టిగేష‌న్‌లో వ‌చ్చే ఎదురు ప‌డే నిజాలు, అవాస్త‌వ‌లేంటి, మ‌ర్డ‌ర్ కేసు ప‌రిశోధ‌న‌లో భాగంగా ఎలాంటి ప‌రిస్థితుల ఎదుర‌య్యాయ‌నే క‌థ‌క‌థ‌నాల‌తో, ఊహించ‌ని మ‌లుపులు, విస్తుపోయే సంఘ‌ట‌న‌ల‌తో సినిమా సాగ‌నుందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. జీతూ జోసెఫ్ మొద‌ట ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అందుకు స‌రైన హీరో పాత్ర‌ధారి దొర‌క‌క తిరిగి మ‌ల‌యాళంలోనే కాస్త స‌మ‌యం తీసుకుని చివ‌ర‌కు ఆసిఫ్ అలీ (Asif Ali)ని క‌త‌నాయ‌కుడిగా పెట్టి ఈ 'మిరేజ్' (Mirage) సినిమాను రూపొందించ‌డం విశేషం. మీరు ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌కుంటే ఇప్పుడే చూసేయండి.

Updated Date - Sep 14 , 2025 | 06:32 PM